మరికొన్ని గంటల్లో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాజీ కాబోతున్నాడు. అక్టోబర్ 18న జరగబోయే బోర్డు మీటింగ్ లో అతని స్థానంలో 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన రోజర్ బిన్నీ ఎంపిక కానున్నాడు. గంగూలీ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి బోర్డు మాత్రం దాదాను కాదని బిన్నీకే అవకాశం ఇవ్వాలని భావించింది. దీంతో దాదా తప్పుకోవడం లాంఛన ప్రాయమే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అమిత్ షా కొడుకుకి రెండోసారి అవకాశం ఇస్తున్నా మీరు గంగూలీకి ఎందుకు ఇవ్వట్లేరని మండిపడ్డారు. అతను చేసిన తప్పేంటో చెప్పాలని బీజేపీ నేతలను నిలదీశారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పనితీరు బాగోలేదని బోర్డు సభ్యులు విమర్శలు చేస్తున్నప్పటికీ అందులో వాస్తవం లేదు. ప్రపంచమంతా కరోనా కల్లోలం రేగుతున్న సమయంలో ఐపీఎల్ 2022 సీజన్‌ని విజయవంతంగా నిర్వహించి, ‘శభాష్’ అనిపించుకున్నాడు దాదా. అంతేకాదు.. ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు కొత్త ప్రాంచైజీలను ఆహ్వానించి బోర్డుకు కాసుల వర్షం కురిపించాడు. ఆపై.. 2023-27 వరకు ఐపీఎల్ మీడియా హక్కుల విక్రయానికి వేలం పాట నిర్వహించి.. దాని ద్వారా రూ.43 వేల కోట్లు ఆర్జించాడు. ఇలా ఎంత చేసినా బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీని మరోసారి కొనసాగించడానికి బోర్డు సభ్యులు ఇష్టపడలేదు. భారత క్రికెట్‌లో ‘దాదా గిరి’’ ఎక్కువయ్యిందంటూ.. అతన్ని బలవంతంగా ఆ పదవి నుంచి దింపేస్తున్నారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ బీజేపీ నాయకులను ఉద్దేశిస్తూ చురకలంటించారు.
➡️ Roger Binny will replace Sourav Ganguly as the new president at the BCCI AGM on Tuesday
➡️ The member will deliberate if BCCI should field a candidate for ICC chair or support incumbent Greg Barclay for a second term
Details ⬇️https://t.co/eK1gWIOCgd
— Firstpost Sports (@FirstpostSports) October 17, 2022
“బీసీసీఐ నుంచి గంగూలీని అక్రమ రీతిలో తప్పిస్తున్నారు. ఇది నన్ను బాధిస్తోంది. సౌరవ్ దేశానికే గర్వకారణం. బోర్డు అధ్యక్షుడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా ఎన్నో సేవలు అందించాడు. ఒక బెంగాల్‌కే కాదు, యావత్ దేశానికి అతను గర్వకారణం. అమిత్ షా కుమారుడు(జై షా) అక్కడే ఉన్నాడు. అతను బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగడంలో మాకు ఎలాంటి సమస్య లేదు కానీ, బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ను ఎందుకు తొలగించారో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం..” అంటూ బీజేపీ అగ్రనేతలను ఉద్దేశిస్తూ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఐసీసీ ఎన్నికల్లో గంగూలీ పోటీ పడే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం అక్టోబర్ 20వ తేదీన నామినేషన్లు వేయనున్నారు. దీనికి దాదా నామినేషన్ సమర్పిస్తాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
#BREAKING Mamata Banerjee has given out a statement saying “Sourav is our pride” over BCCI President switch
TMC’s Manojit Mandal with his views@KamalikaSengupt | @AnushaSoni23#MamataBanerjee #RogerBinny #SouravGanguly #BCCI pic.twitter.com/GUHPIxgYV7
— News18 (@CNNnews18) October 17, 2022