భారతదేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో క్రికెటర్లకు ఎన్నో లవ్ ప్రపోజల్స్ మైదానంలోనే వచ్చేవి. విరాట్ ఐ లవ్ యూ, యూవీ మ్యారీ మీ, రోహిత్ కిస్ మీ .. అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ ప్రేమను తెలిపేవారు కొందరు మహిళలు. ఇదంతా ఒకెత్తు అయితే.. గతంలో “జహీర్ ఖాన్ మ్యారీ మీ” అంటూ ఓ యువతి ప్లకార్డు ప్రదర్శించగా జహీర్ సైతం ప్లైయింగ్ కిస్ ఇచ్చిన వీడియో అప్పట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడంటే ప్లకార్డులతో సరిపెట్టారు గానీ.. గతంలో అయితే ఓ ఇండియాన్ క్రికెటర్ కు ఓ యువతి ఏకంగా గ్రౌండ్ లో ముద్దులు పెట్టిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. టీమిండియా ఆటగాడు అబ్బాస్ అలీ బేగ్ పై మైదానంలోనే ముద్దుల వర్షం కురింపించంది ఆ అమ్మడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది జనవరి, 1960వ సంవత్సరం. ఆస్ట్రేలియా టీమిండియా పర్యటనకు వచ్చింది. ముంబాయి లోని బ్రాబోర్న్ మైదానంలో మ్యాచ్ నడుస్తోంది. టీమిండియా ఓటమి అంచున పోరాడుతోంది. కనీసం టెస్ట్ ను డ్రా చేసుకోవడానికి తెగ కష్టపడుతోంది. అప్పటికి క్రీజ్ లో అబ్బాస్ అలీ బేగ్, రామ్ నాథ్ కెన్నీ లు ఉన్నారు. అలీ అప్పటికే 50 రన్స్ చేసి మంచి ఊపులో ఉన్నాడు. ఈ క్రమంలోనే టీ విరామం కావడంతో ఆటగాళ్లు అంతా బయటకి వస్తున్నారు. ఇదే టైమ్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓ అందమైన యువతి అబ్బాస్ అలీ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించింది. వెంటనే వెనక్కు పరిగెత్తుకు పోయింది. అలీ ఈ మ్యాచ్ ఆడే సమయానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో చదువుతూనే ఉన్నాడు. నూనూగు మీసాలతో అలీ మన్మథుడిగా ఉండటంతో అతడిని ఆమె ముద్దులతో ముంచెత్తింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ అమ్మాయి ఆమె స్నేహితులతో బెట్ కట్టి వచ్చి అలీ కి ముద్దు ఇచ్చింది.
ఈ సంఘటనతో ఒక్క సారిగా ప్రేక్షకులు అందరూ షాక్ కు గురయ్యారు. అయితే అబ్బాస్ మాత్రం ఈ సంఘటనతో తెగ కంగారు పడ్డాడంట. ఎందుకంటే? ఆ రోజు మ్యాచ్ చూడడానికి అతడి తల్లిదండ్రులు కూడా వచ్చారు. దాంతో అలీ.. నేను ఇంగ్లాండ్ వెళ్లి చెడిపోయానని వారు అనుకంటారు అనగానే మైదానం మెుత్తం ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఇక ఈ సంఘటన తర్వాత కొంత మంది క్రికెటర్లు అబ్బాస్ అలీ ని ఆటపట్టించడం మెుదలు పెట్టారు. ఓ సీనియర్ క్రికెటర్ నలుగురు అమ్మాయిలను తీసుకొచ్చి వీళ్లు నీకు ముద్దివ్వడానికి వచ్చారు.. అనగానే వాళ్ల కోరికను నేనెందుకు కాదంటాను అంటూ చమత్కారాలు వేసేవాడు. ఇతడు వేసే పంచులు అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. దాంతో అబ్బాస్ అలీ కి ఒక్కాసారిగా అమ్మాయిల్లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 1960 ల్లోనే అంత ధైర్యం చేసిన అమ్మాయికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు ఈ వార్త చదివిన వారంతా. ఈ ముద్దును ఆదర్శంగా తీసుకున్న డైరెక్టర్ మహేశ్ మథాయ్, క్యాడ్‌బెరీ డైరీ మిల్క్ యాడ్‌ని రూపొందించాడు. బాయ్ ఫ్రెండ్ సిక్సర్ కొట్టడంతో చాక్లెట్ తీంటూ ఉన్న గర్ల్ ఫ్రెండ్ మైదానంలోకి వచ్చి అతడికి ముద్దు పెడుతుంది. ఈ యాడ్ ఇప్పటికీ ఓ సంచలనమే.