క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. మినీ క్రికెట్ సంగ్రామం తాజాగా ప్రారంభం అయ్యింది. తొలి మ్యాచ్ లో ఆసియా కప్ విజేత అయిన శ్రీలంకకు షాక్ ఇస్తూ.. పసికూన నమీబియా టోర్నీలో తొలి విజయం నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో పసికూన జట్టు అయిన స్కాట్లాండ్.. ఈ సారి ఏకంగా రెండు సార్లు టీ20 ప్రపంచ కప్ విజేత అయిన విండీస్ జట్టుకు భారీ షాక్ ఇచ్చింది. “హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటావ్” అన్న సామెతను అక్షరాల నిజం చేసి చూపించింది స్కాట్లాండ్. తాజాగా జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. దాంతో గ్రూప్ స్టేజీ మ్యాచ్ లు ఇంకా రసవత్తరంగా మారాయి.
టీ20 ప్రపంచ కప్ ప్రారంభం అయ్యింది. అది కూడా సంచలనాలతో. అందరూ భావించినట్లుగానే ఈ సారి చిన్న జట్లు.. పెద్ద జట్లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూ.. ప్రపంచ కప్ లో దూసుకెళ్తున్నాయి. తొలి రోజు నమోదైన సంచలనం మరవక ముందే, రెండో రోజు కూడా మరో సంచలనం నమోదైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్ జట్టుకు స్కాట్లాండ్ ఓపెనర్లు చుక్కలు చూపించారు. విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ.. తొలి వికెట్ కు 6.2 ఓవర్లలోనే 55 పరుగులు జోడించి, జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హోల్డర్ మైఖెల్ జోన్స్ ను అవుట్ చేశాడు. దాంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్ మెన్ లు విండీస్ బౌలర్లకు తలొగ్గారు. దాంతో వరుసగా.. క్రాస్(3), బ్రింగ్టన్(16), మెక్లాయిడ్(23), లీక్స్(4) పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
ఓపెనర్ మున్సే 53 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా.. అతడికి 16 రన్స్ చేసిన క్రిస్ గ్రేవ్స్ సహకారం అందిచి క్రీజ్ లో నిలిచాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి స్కాట్లాండ్ 160 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జోసెఫ్, హోల్డర్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆరంభంలోనే ఆ జట్టును స్కాట్లాండ్ బౌలర్ డావే దెబ్బతీశాడు. 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 20 పరుగులు చేసి మంచి ఊపులో ఉన్న కైల్ మేయర్స్ ను డావే అవుట్ చేశాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చి హిట్టర్ బ్రెండన్ కింగ్ తో కలిసి లూయిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లూయిస్.. వీల్ బౌలింగ్ లో జోన్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంటనే బ్రెండన్ కింగ్ సైతం 17 రన్స్ వద్ద బౌల్డ్ అయ్యిడు. ఇక అప్పటి నుంచి విండీస్ పతనం మెుదలైంది.
What a performance 🔥
Scotland get their campaign underway with a commanding victory against West Indies 💪#T20WorldCup | #WIvSCO | 📝 https://t.co/zYWEnEHtif pic.twitter.com/rWZPmS9wyR
— T20 World Cup (@T20WorldCup) October 17, 2022
ఇక విండీస్ ను ఆదుకుంటాడు అనుకున్న కెప్టెన్ పూరన్ కేవలం 4 పరుగులకే అవుట్ అయ్యాడు. దాంతో జట్టు ఆశలు మెుత్తం అడిఆశలైయ్యాయి. పావెల్(5), హోసేయిన్(1), జోసెఫ్(0), ఓడియన్ స్మిత్(5), బ్రూక్స్(4) పరుగులతో నిరశ పరచగా.. ఆల్ రౌండర్ హోల్డర్ ఒక్కడే పోరాడాడు. అతడు 33 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్ తో 38 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లు విజృంభించడంతో 18.3 ఓవర్లలో 118 పరుగులకే విండీస్ కుప్పకూలింది. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, వీల్, లీస్క్ తలా రెండు వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జార్జి మున్సే కు లభించింది. ఈ మ్యాచ్ చూసిన క్రీడాభిమానులు నిన్న లంక.. నేడు విండీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
A brilliant 66* off 53 👏
For his knock, George Munsey is the @aramco Player of the Match 🎉#T20WorldCup | #WIvSCO pic.twitter.com/wFteWuUtJA
— T20 World Cup (@T20WorldCup) October 17, 2022