టీ20 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న వార్మప్ మ్యాచ్ ల్లో సత్తా చాటింది. ఇక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. మెుదట బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన టీమిండియా ఆటగాళ్లు.. ఆ తర్వాత బౌలింగ్ లో సత్తా చాటారు. అయితే ఈ మ్యాచ్ కు హీరో మాత్రం విరాట్ కోహ్లీ అనే చెప్పాలి. ఓడిపోయే మ్యాచ్ ను తన అద్భతమైన ఫీల్డింగ్ తో గెలిపించాడు. చివరి ఓవర్లో అద్భుతమైన ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. అతడి విన్యాసాలు చూసిన వారంత.. ఆనాటి జాంటీ రోడ్స్ ను మరోసారి గుర్తు చేశావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.
విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. ఈ క్రమంలోనే ఫిట్ నెస్ కు పెట్టింది పేరుగా వార్తల్లో నిలిచాడు. ఇప్పటి వరకు ఒక్క సారికూడా గాయపడి ఫిట్ నెస్ కోల్పొకుండా టీమిండియా జట్టులో రికార్డు క్రియేట్ చేశాడు. అతడి ఫిట్ నెస్ ఏ స్థాయిలో ఉందో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక ప్రాక్టీస్ లో మరోసారి నిరూపించాడు. ఈ క్రమంలోనే ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ ను తన అద్భతమైన ఫీల్డింగ్ తో గెలిపించాడు. 18 వ ఓవర్ హర్షల్ పటేల్ వేయడానికి రాగా.. జోస్ ఇంగ్లీష్, టీమ్ డేవిడ్ లు క్రీజ్ లో ఉన్నారు. ఈ ఓవర్ రెండో బంతిని ఇంగ్లీష్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేయగా.. ఇద్దరు పరుగుతీయబోయారు. కానీ మిడాఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ చిరుత వేగంతో కదిలి బాల్ ను అందుకుని త్రో చేశాడు. బాల్ డైరెక్ట్ గా వికెట్లను తాకడంతో టిమ్ డేవిడ్ అవుట్ అయ్యడు. డైవ్ చేస్తూ.. చేసిన ఈ అద్భుత త్రోను చూసిన అభిమానులు జాంటీ రోడ్స్ ను తలపిస్తున్నాడు అంటూ ప్రశంసిస్తున్నారు.
అదే కాక చివరి ఓవర్లో సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఇక చివరి ఓవర్లో ఆసిస్ విజయానికి 11 పరుగులు అవసరం అయ్యాయి. ఈ నేపథ్యంలో బౌలింగ్ కు వచ్చిన మహమ్మద్ షమీ.. ఆసిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ.. బ్యాటర్లను అడ్డుకున్నాడు. ఈ ఓవర్లో మూడో బాల్ ను పాట్ కమ్మిన్స్ భారీ షాట్ ఆడగా.. లాంగ్ ఆన్ లో ఉన్న కోహ్లీ గాల్లోకి ఎగురుతూ.. సింగిల్ హ్యాండ్ తో బాల్ ను ఒడిసిపట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో విరాట్ అభిమానులు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఓవర్లో షమీ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను నేలకూల్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెుదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది.