వామప్ మ్యాచే అయినా.. చివరి వరకు ఉత్కంఠగా సాగింది. అసలు వరల్డ్ కప్ జట్టులోనే లేని బౌలర్ వచ్చి.. టీమిండియాను గెలిపించాడు. గాయం కారణంగా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ కప్‌కు దూరం కావడంతో మరో స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని అనూహ్యంగా అవకాశం దక్కింది. కానీ.. అతని ఫిట్‌నెస్‌పై లక్ష అనుమానాలు. పైగా షమీ టీ20 మ్యాచ్ ఆడి చాలా కాలం అయిపోయింది. ఇలాంటి సవాళ్ల మధ్య ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో షమీ అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో 11 పరుగులను డిఫెండ్ చేస్తూ.. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి.. చివరి నాలుగు బంతుల్లో 4 వికెట్లతో టీమిండియాను గెలిపించాడు. అసలు విషయం ఏమిటంటే.. అసలు ఈ మ్యాచ్‌లో షమీ లేడు.
అవును నిజం. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన 11 మంది ఆటగాళ్లు జాబితాతో షమీని తీసుకోలేదు. కానీ.. వామప్ మ్యాచ్‌లో ఉండే వెసులుబాటుతో షమీని చివరి ఓవర్ వేయించిన టీమిండియా కెప్టెన్ రోహిత్.. అద్భుత ఫలితాన్ని రాబట్టాడు. మ్యాచ్ చేజారుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అద్భుత ఫీల్డింగ్‌తో 19వ ఓవర్‌లో టిమ్ డేవిడ్‌ను రనౌట్ చేసి మ్యాచ్‌ను బలుపు తిప్పగా.. ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 11 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటి వరకు మ్యాచ్ జరిగిన విధానం చూస్తే.. ఆసీస్ విజయం ఖాయంగా కనిపించింది. కానీ.. అనూహ్యంగా చివరి ఓవర్ వేసేందుకు రోహిత్ మొహమ్మద్ షమీని బరిలోకి దింపాడు.
తొలి బంతికి రెండు, రెండో బంతికి రెండు పరుగులు రావడంతో.. 4 బంతుల్లో 7 పరుగులుగా సమీకరణాలు మారిపోయాయి. కానీ.. తర్వాతి బంతికి ప్యాట్ కమిన్స్ లాంగ్‌ఆన్‌లో భారీ షాట్ ఆడగా.. విరాట్ కోహ్లీ సింగిల్ హ్యాండ్‌తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో కమిన్స్ పెవిలియన్ చేరాడు. 4వ బంతికి అగర్‌ను షమీ రనౌట్ చేశాడు. 5వ బంతికి జాస్ ఇంగ్లిస్‌ను అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసిన షమీ.. చివరి బంతికి రిచర్డ్‌సన్‌ను కూడా సూపర్ యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక ఓవర్ వేసిన షమీ 4 పరుగుల ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్స్‌లో టీమిండియా షమీ రూపంలో ఒక ధైర్యం దొరికినట్లు అయింది. ఇక రెండో వామప్ మ్యాచ్‌ను న్యూజిలాండ్‌పై ఆడనున్న టీమిండియా.. 23న పాకిస్థాన్‌తో అసలు సిసలైన మ్యాచ్ ఆడనుంది.
What an over by Mohammad Shami – 2,2,W,W,W,W.
– Bowled his first over in the match under pressure and delivered it for India! He’s earned that place, splendid over by Shami. pic.twitter.com/v7rpkIajK6
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 17, 2022
India Win The Warm-Up Game Against Australia!
Mohammad Shami bowled 1 over!
4 wickets in 4 balls (1 run out)!
2,2,W,W,W,W
Champion bowler!! #indvaus
Thats why experience matters a lot#MohammadShami 🔥🔥#Cricket #INDvAUS #AUSvIND #T20WorldCup #MoahmmedShami #ViratKohli pic.twitter.com/MBxIhs1Nlo— Journalist_Rakshit Yadav (@RakshitYadav25) October 17, 2022