ప్రపంచంలో మరే బ్యాటర్ లేనంత భీకరమైన ఫామ్‌లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఉన్నట్లు కనిపిస్తున్నాడు. బ్యాటింగ్‌కు వస్తే.. చాలు బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతున్నాడు. పిచ్ ఏదైనా, బౌలర్ ఎవరరైనా.. తనకు తెలిసింది ఒక్కటే కొట్డుడు అన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు సూర్య. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వామప్ మ్యాచ్‌లోనూ.. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సోమవారం గాబా వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి వామప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపు ఆరంభాన్ని అందించాడు.
ఒక వైపు రోహిత్ వర్మ ఖాతా తెరవకముందే.. కేఎల్ రాహుల్ 49 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివరి 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడుతూనే.. తన దైన స్టైల్లో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 360 డిగ్రీ యాంగిల్‌లో బ్యాటింగ్ చేస్తూ.. ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక వైపు వికెట్లు పడుతున్నా తన మాత్రం నిలకడగా ఆడుతూ.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వరకు నిలబడ్డాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో 50 పరుగులు పూర్తి చేసుకున్న సూర్య.. చివరి ఓవర్ 4వ బంతికి రిచర్డ్‌సన్ బౌలింగ్ లెగ్‌సైడ్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు.
కానీ షాట్ మిస టైమ్ అవ్వడంతో.. బౌలర్ రిచర్డ్ సన్‌కు సింపుల్ క్యాచ్ వచ్చింది. ఊహించని ఈ క్యాచ్‌కు రిచర్డ్‌సన్ సైతం ఆశ్యర్యానికి గురయ్యాడు. క్యాచ్‌ను నమ్మలేక ఫేస్‌పై చేతులు పెట్టుకుని నవ్వుతూ.. బౌలింగ్‌కు వెళ్లాడు. అంతకుముందు మంచి షాట్లతో ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించిన సూర్యకుమార్ యాదవ్.. చివరి ఫన్నీగా అవుటై పెవిలియన్ చేరాడు. చివరి ఓవర్ 5వ బంతికి క్రీజ్‌లోకి వచ్చిన వెంటనే భారీ సిక్స్ కొట్టిన అశ్విన్ ఇన్నింగ్స్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా 186 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఆసీస్ బౌలర్ల షార్ట్ పిచ్ బంతులకు, బౌన్సర్లకు ఇబ్బంది పడ్డారు. ఆసీస్ బౌలర్లు.. కేఎస్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు డెడ్లీ బౌన్సర్లను సంధించారు. హెల్మెట్ ఉండటంతో ఇద్దరికీ ప్రమాదం తప్పింది.
T20 WC Warm-up. WICKET! 19.4: Suryakumar Yadav 50(33) ct & b Kane Richardson, India 180/6 https://t.co/nr6yThDoiM #INDvAUS #T20WorldCup
— BCCI (@BCCI) October 17, 2022