టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం సరైన ఫామ్‌లో లేడు. అతన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ఎంత బ్యాక్ చేస్తున్నా.. పంత్ మాత్రం వరుసగా విఫలం అవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా.. పలు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. టీమిండియాలో కీ ప్లేయర్‌గా ఉన్న పంత్.. తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వడంలేదు. పైగా తనకు పక్కలో బల్లెంలా సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ సూపర్ ఫామ్‌లో ఉంటూ జట్టులో తన ప్లేస్‌కు ఎసరుపెడుతున్నాడు. పంత్ ఉన్న ఫామ్‌ను బట్టి.. అతని ప్లేస్‌లో డీకేను తీసుకోవడానికే టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు కోచ్, కెప్టెన్ సైతం మొగ్గుచూపుతున్నారు. పంత్ జట్టులో ఉన్నా.. డీకేను కూడా ఆడిస్తున్నారు.
ఇక పెర్త్ వేదికగా వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ పంత్ దారుణంగా విఫలం అయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓపెనర్‌గా వచ్చిన పంత్.. కనీసం 20 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయాడు. దీంతో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తుది జట్టులో ఉంటాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిల్లో తనకు పోటీగా ఉన్న దినేష్ కార్తీక్ వద్దే పంత్ బ్యాటింగ్ రిప్స్ తీసుకుంటున్నాడు. పంత్ ఫామ్‌లోకి వస్తే.. తన ప్లేస్ ప్రమాదంలో పడుతుందని తెలిసినా.. దినేష్ కార్తీక్ ఎంతో నిస్వార్థంతో పంత్ ఫామ్ పుంజుకోవడంపై ఫోకస్ పెట్టాడు. ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్‌కు ముందు పంత్‌కు బ్యాటింగ్ టిప్స్ చెబుతూ కనిపించాడు.
రిషభ్ పంత్‌కు దినేష్ కార్తీక్ కోచింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జట్టు కోసం పోటీదారులుగా ఉన్న ఆటగాళ్ల మధ్య ఇలాంటి మంచి సపోర్టింగ్ నేచర్ ఉండటం టీమిండియాకు ఎంతో మంచి చేస్తుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వామప్ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్ కేఎస్ రాహుల్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో మరో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో 23న అసలు సిసలు వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది.