టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2022 కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న కోహ్లీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లు, నెట్ సెషన్స్‌తో ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన ఫోకస్ మొత్తం వరల్డ్ కప్‌పైనే పెట్టాడు. నేడు(సోమవారం) ఆస్ట్రేలియాతో వామప్‌మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. అంతకుముందు పెర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ బరిలోకి దిగలేదు. 23న పాకిస్థాన్‌తో అసలు సిసలైన తొలి వరల్డ్ కప్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో భారత్ వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఆడే అవకాశం ఉంది.
కాగా.. విరాట్ కోహ్లీ అనుష్కశర్మతో కాకుండా మరో అమ్మాయితో ఉన్నాడంటూ.. ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయితో కోహ్లీ దిగిన ఫొటో.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా.. అచ్చం సినిమా హీరోయిన్‌లా ఉంది. దీంతో అమ్మాయి ఎవరూ? కోహ్లీతో ఎందుకు ఫొటో దిగింది? అంటూ నెటిజన్లు తెగ హైరనా పడిపోతున్నారు. కాగా.. ఆ అమ్మాయి పేరు అమీషా బసేరా ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఈ అమ్మాయి విరాట్ కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్. కోహ్లీ అంటే పడిచచ్చంతే పచ్చి. కోహ్లీని కలవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కోహ్లీ.. ఆస్ట్రేలియాలో ఉండగా.. ఎలాగోలా కోహ్లీని కలిసే ఛాన్స్ కొట్టేసింది. వెంటనే కోహ్లీతో ఒక ఫొటో దిగి.. సోషల్ మీడియాలో పెట్టేసింది.
తన ఐడిల్‌ను కలుసుకోవడంతో తన కల నిజమైందని, తనకు మాటలు రావడం లేదంటూ చాలా ఎగ్జైట్‌మెంట్ ఫీలైంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లీతో దిగిన ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2022 నుంచి తన పూర్వ వైభవాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కొంతకాలం సరైన ఫామ్‌లో లేని కోహ్లీ.. ఇప్పుడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లో పాటు ఆస్ట్రేలియాతో జరిగి టీ20 సిరీస్‌లోనూ సూపర్ బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు.