రాక.. రాక వచ్సిన అవకాశం.. ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అమ్మవారి ఆశీస్సులు ఉంటే మరింత మంచి ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. ఆ నమ్మకంతోనే భారత క్రికెటర్, టెస్టు టీమ్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సతీసమేతంగా విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. భార్య అంజలితో శారదా పీఠానికి విచ్చేసిన అతడు రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భారత క్రికెటర్, టెస్టు టీమ్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సతీసమేతంగా విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. భార్య అంజలితో శారదా పీఠానికి విచ్చేసిన అతడు రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ దంపతులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి భరత్, స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు.
మరికొద్ది రోజుల్లో 16వ సీజన్ ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లేముందుగా భరత్ శారదా పీఠాన్ని సందర్శించారు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసమే శారదాపీఠానికి విచ్చేసినట్లు అతడు తెలిపారు. భరత్.. ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తరుపున బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో టైటాన్స్ యాజమాన్యం 1.2 కోట్లు వెచ్చించి మరీ భరత్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్ట్ జట్టులో స్తానం సంపాదించిన భరత్, ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసి.. వన్డే, టీ20 జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. కాగా, ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావాస్కర్ ట్రోఫీలో భరత్ ప్రదర్శన అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 20 సగటుతో నాలుగు మ్యాచుల్లోకలిపి 101 పరుగులు మాత్రమే చేశాడు.
శారదాపీఠంలో క్రికెటర్ కేఎస్ భరత్#TeamIndia #KSbharat #Visakhasaradapeetham #YouSay pic.twitter.com/SemWO06Hiv
— yousaytv (@yousaytv) March 17, 2023