ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు నిదానంగా రంగం సిద్ధం అవుతోంది. ఫైనల్ కి వచ్చిన న్యూజిలాండ్, ఇండియా తమకి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ విషయంలో భారత్ కన్నా న్యూజిలాండ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కివీస్ కి ఇంగ్లాండ్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తోంది. ఇప్పటికే వీటిలో ఒక టెస్ట్ డ్రాగా ముగియగా, మరి టెస్ట్ జరగాల్సి ఉంది. అయితే.., సెకండ్ టెస్ట్ కి ముందు న్యూజిలాండ్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్ మెన్, కెప్టెన్ కేఎన్ విలియమ్సన్ గాయపడ్డాడు. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ ఎడమ మోచేయికి గాయమైంది. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. కివీస్ టీమ్ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. ఇక రెండో టెస్టులో కేన్ ఆడతాడో లేదో ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
నిజానికి కేన్కు అయిన గాయం చిన్నదే అయినా, కివీస్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే తరువాత ఇండియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది. రెండేళ్ల కష్టం తరువాత రెండు టీమ్ లు ఫైనల్ కి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో కేన్ కనుక మ్యాచ్ కి దూరం అయితే న్యూజిలాండ్ కి గట్టి దెబ్బ తగిలినట్టు అవుతుంది. ఈ కారణంగానే కేన్ గాయం విషయంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందట. జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో.., అతను త్వరగా కోలుకోవాలని న్యూజిలాండ్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా.., విలియమ్సన్ కి భారత్ పై మెరుగైన రికార్డ్ ఉంది. కానీ.., ఇప్పుడు అతను పేలవ ఫామ్ లో ఉన్నాడు. గత రెండేళ్లుగా కేన్ మామ విదేశాల్లో విఫలం అవుతూ వస్తున్నాడు. కానీ.., ఇప్పటికీ ఇతనే న్యూజిలాండ్ కీ ప్లేయర్. మరి.., ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి ముందే విలియమ్సన్ ఫుల్ ఫిట్నెస్ సాధిస్తాడేమో చూడాలి. మరి.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.