ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు నిదానంగా రంగం సిద్ధం అవుతోంది. ఫైనల్ కి వచ్చిన న్యూజిలాండ్, ఇండియా తమకి అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ విషయంలో భారత్ కన్నా న్యూజిలాండ్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కివీస్ కి ఇంగ్లాండ్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తోంది. ఇప్పటికే వీటిలో ఒక టెస్ట్ డ్రాగా ముగియగా, మరి టెస్ట్ జరగాల్సి ఉంది. […]