ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లా పర్యటనకు వెళ్లిన టీమిండియా.. తొలి రెండు వన్డేల్లో ఓడి ఘోర అవమానం ఎదుర్కొంది. పసికూన బంగ్లాదేశ్‌తో ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ చేతుల్లో ఉన్న మ్యాచ్‌ను పొగొట్టుకుంది టీమిండియా. పైగా.. రెండో వన్డేలో ఇద్దరు భారత ఆటగాళ్లు గాయాపాలయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ అనముల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. ఆ తర్వాత ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లిపోయిన రోహిత్.. తిరిగి 9వ స్థానంలో తప్పని పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.
రోహిత్ శర్మతో పాటు.. ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సైతం బౌలింగ్ వేస్తూ.. కండరాలు పట్టేయడంతో కేవలం 3 ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. బ్యాటింగ్‌కు వచ్చినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. వీరిద్దరితో పాటు తొలి వన్డేతో అరంగేట్రం చేసిన పేసర్ కుల్దీప్ సేన్ సైతం తొలి వన్డేలోనే గాయపడ్డాడు. దీంతో అతను రెండు, మూడో వన్డేలకు దూరం అయ్యాడు. ఇలా ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో మూడో వన్డేలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్, దీపక్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. అయితే.. నేడు(శనివారం) జరుగుతున్న చివరి వన్డే తర్వాత.. భారత్, బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు సైతం అందుబాటులో ఉండటం అనుమానమే.
అలాగే మరో సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ కూడా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా అతని స్థానంలో వెటరన్ క్రికెటర్ జయదేవ్ ఉనద్కట్‌ను టెస్టు సిరీస్‌కు షమీ స్థానంలో ఎంపిక చేసింది బీసీసీఐ. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న ఉనద్కట్ దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఉనద్కట్ కెప్టెన్సీలోని సౌరాష్ట్ర జట్టు ఇటివల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీని గెలిచింది. కాగా.. టీమిండియా తరఫున 2010లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఉనద్కట్.. జాతీయ జట్టు తరఫున పెద్దగా రాణించలేదు. 2013లో టీమిండియా తరఫున 7 వన్డేలు ఆడి 8 వికెట్లు తీశాడు. అలాగే 2016-18 మధ్య 10 టీ20 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక 2010లో టీమిండియా తరఫున సెంచూరియన్‌లో జరిగిన ఒకే ఒక టెస్టులో ఆడిన ఉనద్కట్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు.
JUST IN: Jaydev Unadkat has been called up as Mohammed Shami’s replacement for India’s Test series against Bangladesh 🏏#BANvIND pic.twitter.com/h5mZLgkpxK
— ESPNcricinfo (@ESPNcricinfo) December 10, 2022