ఇండియా Vs ఇంగ్లాండ్ రీషెడ్యూల్ట్ మ్యాచ్ లో టీమిండియా సత్తా చాటింది. జాస్ప్రిత్ బుమ్రా కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రేక్షకులనే కాదు.. టీమిండియా మొత్తాన్ని ఆకట్టుకుంది. బుమ్రా ఆడిన ప్రతి బంతిని డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా ఎంజాయ్ చేసింది. బుమ్రా కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 31* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన బ్యాటింగ్‌తో కెప్టెన్ బుమ్రా టీ20ని తలపించాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు(35) వచ్చిన ఓవర్ కూడా ఇదే కావడం విశేషం.
జాస్ప్రిత్ బుమ్రా టెస్టు చరిత్రలో వరల్డ్ రికార్డ్ బ్యాటింగ్ చేశాడు. మరోవైపు టెస్టుల్లో ఒక్క ఓవర్లో(35 పరుగులు) ఇచ్చి స్టువర్టు బ్రాడ్ తన పేరిట ఓ చెత్త రికార్డును నెలకొల్పాడు. టీ20ల్లో 6 బంతుల్లో 36 పరుగులు ఇచ్చిన స్టువర్ట్ బ్రాడ్ వైట్ బాల్ క్రికెట్ లోనూ 35 పరుగులు ఇచ్చిన బౌలర్ గా నిలిచాడు. ఇంక బుమ్రా బ్యాటింగ్ విషయానికి వస్తే.. స్టువర్ట్ బ్రాడ్ కు యువరాజ్ సింగ్ ని గుర్తు చేశాడనే చెప్పాలి. బ్రాడ్ అప్పుడు, ఇప్పుడు కేవలం చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు.
Stuart Broad to @Jaspritbumrah93 the batter💥💥
An over to remember! A record shattering over! #ENGvIND pic.twitter.com/l9l7lslhUh
— BCCI (@BCCI) July 2, 2022
స్టువర్టు బ్రాడ్ వేసిన 84వ ఓవర్ ఇలా సాగింది.. మొదటి బంతికి 4, రెండో బంతి వైడ్+4, తర్వాత 6(నోబాల్), 4, 4, 4, 6, 1 మొత్తం ఎక్స్ ట్రాలతో కలిపి 35 పరుగులు వచ్చాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌట్ అయ్యింది. . రిషబ్ పంత్(111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146), రవీంద్ర జడేజా(194 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 104 పరుగులు) రాణించడంతో ఇండియాకి మంచి స్కోర్ లభించింది.
Real Id se aao @YUVSTRONG12 !!!
35 run to Broad !!! Boom Boom Bumrah 🔥🔥🔥🔥
.
Captain in some agression Broady !!!
.
.
.#INDvENG #ENGvIND #ViratKohli𓃵 #JaspritBumrah #Cricket #Pant #Jadeja #testcricket #shami #bumrah #RishabhPant #RavindraJadeja pic.twitter.com/JC3JzpUk62— Kushagra (@Sports__Buff) July 2, 2022
ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే.. జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు, పోట్స్ 2 వికెట్లు, బ్రాడ్, స్టోక్స్, రూట్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలిగింది. ఐదో టెస్టులో ప్రస్తుతం టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. బుమ్రా వరల్డ్ రికార్డ్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
World record alert: 35 runs in a single over – Bumrah is the hero. pic.twitter.com/B43Ic5T9mD
— Johns. (@CricCrazyJohns) July 2, 2022