టీ20 వరల్డ్ కప్ 2022లో విరాట్ కోహ్లీకి రెండు భారీ సిక్సులు సమర్పించుకున్న హరీస్ రౌఫ్ గుర్తున్నాడుగా.. ఇప్పుడు మరోసారి ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్‌కి ఏకంగా మూడు సిక్సులు సమర్పించుకున్నాడు.
పాకిస్థాన్ స్టార్ బౌలర్ హరీస్ రౌఫ్‌ను ఇంగ్లండ్ బ్యాటర్ జాసన్ రాయ్ దంచికొట్టాడు. పీఎస్ఎల్(పాకిస్థాన్ క్రికెట్ లీగ్ 2023)లో భాగంగా మంగళవారం లాహోర్ కలందర్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ జరిగిన మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ దారుణంగా తేలిపోయాడు. కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన రౌఫ్ ఏకంగా 43 పరుగుల సమర్పించుకున్నాడు. ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అయితే.. రౌఫ్ బౌలింగ్‌లో ముఖ్యంగా జాసన్ రాయ్ చెలరేగి ఆడాడు.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసేందుకు వచ్చిన రౌఫ్‌ను దంచికొట్టాడు. ఆ ఓవర్లో రెండు బంతికి భారీ సిక్స్ కొట్టిన రాయ్.. మూడు, నాలుగో బంతులను కూడా భారీ సిక్సులుగా మలిచాడు. చివరి బంతికి సింగిల్ తీసుకోవడం ద్వారా ఓవర్లో ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ కలండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. షై హోప్ 32 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేశాడు. అలాగే ఓపెనర్ మీర్జా బెగ్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేశాడు. చివర్లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా 16 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో 32 పరుగులు చేయడంతో లాహోర్ భారీ స్కోర్ చేసింది. గ్లాడియేటర్స్ బౌలర్లలో ఒడియన్ స్మిత్ 2, అహ్మద్ 2 వికెట్లతో రాణించారు. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వాట్టా గ్లాడియేటర్స్‌కు లాహోర్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ అబ్దుల్‌ను డకౌట్ చేశాడు.
ఆ తర్వాత మార్టిన్ గప్టిల్, జాసన్ రాయ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ నమోదైనా.. దాన్ని క్వాట్టా నిలబెట్టుకోలేకపోయింది. జాసన్ రాయ్ 30 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సులతో 48 పరుగులు చేసినా.. క్వాట్టా జట్టును గట్టెక్కించలేకపోయాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో క్వాట్టా గ్లాడియేటర్స్ టీమ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కాగా.. ఈ మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా మారినా.. మిగతా బౌలర్లు రాణించడంతో లాహోర్ గెలిచింది. అయిదే.. టీ20 వరల్డ్ కప్ 2022లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రౌఫ్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్స్‌లతో పాక్ గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌లో రౌఫ్ బౌలింగ్‌ను జాసన్ రాయ్ చీల్చిచెండాటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.