సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022లో సఫారీలు బోణీ కొట్టారు. ఐదు టీ20ల సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేశారు. 211 భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా.. సౌత్ ఆఫ్రికా క్రికెట్ హిస్టరీలోనే ఇదే అతి పెద్ద ఛేజ్ కావడం విశేషం. భారీ స్కోరు నమోదు చేయడంలో టీమిండియా బ్యాట్స్ మన్లు సక్సెస్ అయినా కూడా.. ఆ లక్ష్యాన్ని కాపడటంలో మాత్రం బౌలింగ్ విభాగం మాత్రం దారుణంగా విఫలమైంది. 8.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసిన పరిస్థితి నుంచి తర్వాత వికెట్ కోల్పోకుండా సఫారీలు మ్యాచ్ నెగ్గారు. టీమిండియా చేతులారా ఈ మ్యాచ్ ను ఓడిపోయింది అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ లో అంతగా రాణించని ఇషాన్ కిషన్ టీ20 సిరీస్ లో మాత్రం తొలి మ్యాచ్ లోనే అర్ధ శతకం(74)తో చెలరేగిపోయాడు. శ్రేయస్ అయ్యర్(36), హార్దిక్ పాండ్యా(31) కూడా అద్భుతంగా రాణించారు. కానీ, రస్సీ వాన్ డెర్ డుస్సెన్(46 బంతుల్లో 75*), డేవిడ్ మిల్లర్(31 బంతుల్లో 64) మాత్రం చెలరేగడంతో టీమిండియాకి పరాభవం తప్పలేదు.
The celebrations continue for David Miller 🥳
Happy Birthday and have a smashing day 🎂 pic.twitter.com/iBSzigccuN
— Cricket South Africa (@OfficialCSA) June 10, 2022
అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడం వెనుక అసలు కారణం రిషబ్ పంత్ అంటూ చెబుతున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా కెప్టెన్ గా పంత్ ఫెయిల్ కావడం వల్లే.. ఇంత భారీ స్కోర్ నమోదు చేసి కూడా మ్యాచ్ ఓడిపోయారంటూ కామెంట్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు అంతా చాహల్ ను చూసి భయపడుతున్నాం అంటే.. చాహల్ నే పూర్తిగా వాడుకోలేకపోయాడు. ఫీల్డింగ్ విషయంలోనూ పంత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Simply sensational 🔥#INDvSA #BePartOfIt pic.twitter.com/UWJsxRWuLq
— Cricket South Africa (@OfficialCSA) June 9, 2022
మ్యాచ్ తర్వాత పంత్ మాట్లాడుతూ తన తప్పును ఒప్పేసుకున్నాడు. ‘మా జట్టులో ఎంతో మంది అద్భుతమైన ప్లేయర్లు ఉన్నా కూడా వారిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మేం విఫలమయ్యాం. ప్రత్యర్థులు మిల్లర్, ఆర్వీడీ ఎంతో అద్భుతంగా రాణించారు. వికెట్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ఎంతో అనుకూలంగా వ్యవహరించింది.’ అంటూ పంత్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా గెలవాల్సిన మ్యాచ్ ను పంత్ చేతులారా పోగొట్టాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
That’s that from the 1st T20I.
South Africa win by 7 wickets and go 1-0 up in the 5 match series.#TeamIndia will look to bounce back in the 2nd T20I.
Scorecard – https://t.co/YOoyTQmu1p #INDvSA @Paytm pic.twitter.com/1raHnQf4rm
— BCCI (@BCCI) June 9, 2022