అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నందుకు సంతోషించాలో.. సమాజంలో ఇంకా ఆడామగా బేధాలున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి.. ప్రస్తుత సమాజంలో నెలకొంది. నేటికి కూడా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు కోకొల్లలు. ఇక చాలా దేశాల్లో.. నేటికి కూడా మహిళ అంటే.. కేవలం వంటింటి సరుకుగా మాత్రమే చూస్తారు. వారిపై అనేక ఆంక్షలు విధించి.. నాలుగు గోడల మధ్య బంధిస్తారు. కాదని మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తే.. అత్యంత కర్కశంగా వారిని.. వారి పోరాటానికి మద్దతిచ్చేవారిని హతమారుస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. మహిళల హక్కుల కోసం పోరాడినందకు ఓ ఫుట్‌బాల్ ప్లేయర్‌కి.. మరణశిక్ష విధించింది ఓ దేశం. ఆ వివరాలు..
ఈ విషాదకర సంఘటన ఇరాన్‌లో చోటు చేసుకుంది. మహిళల హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నడన్న కారణంగా.. ఇరాన్ ప్రభుత్వం.. అమీర్ నసర్ అజాదాని అనే 26 ఏళ్ల.. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడికి మరణ శిక్ష విధించడం.. సంచలనంగా మారింది. ఈ విషయాన్ని.. ఫిఫ్ప్రో అనే సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. ఇది సంచలనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 65,000 మంది ఆటగాళ్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సంస్థ.. డిసెంబర్ 12 రాత్రి ట్విట్టర్ వేదికగా- ఇరాన్ ఫుట్ బాల్ ప్లేయర్‌కు విధించిన మరణశిక్ష విషయాన్ని వెల్లడించింది. మహిళల హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడని అమీర్‌కు ఇలా మరణ శిక్ష విధించడం దారుణమని.. తాము అతనికి అండగా నిలబడి శిక్షను రద్దు చెయ్యాలని పోరాడుతాం అని ఈ సందర్భంగా సదరు సంస్థ ట్వీట్ చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 22 ఏళ్ల మహ్స అమిని అనే ఇరాన్ మహిళా పొలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందింది. హిజాబ్ సరిగ్గా ధరించలేన్న కారణంతో.. ప్రభుత్వానికి చెందిన మోరల్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసు కస్టడీలోనే అమిని మృతి చెందడంతో.. దీనిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో అమిని మృతికి పోలీసులు, ప్రభుత్వమే కారణమంటూ.. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు మద్దతుగా నిలిచారు. అంతేకాక.. మహిళా హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇది పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ క్రమంలో ఇరాన్ లో నవంబర్ 17 న జరిగిన ఆందోళనల్లో ఇద్దరు సైనికులు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రోప్స్‌కి చెందినాఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటనకు తనే కారణం అని అమీర్ ఒప్పుకోవడంతో అతనికి ప్రభుత్వం మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. ‘నవంబర్ 20 న అమీర్ టీవీలో కనిపించి ఆ హత్యలకు కారణం అతనే అని ఒప్పుకున్నాడు. అందుకే అతడికి ఈ శిక్ష విధించామని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇక అమీర్ నసర్ -అజాదాని ప్రొఫెసనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. అతడు అమీర్ సేపహన్ కు ఆడటంతో తన కెరీర్ ప్రారంభించాడు. 2015 లో రహ్-అహాన్‌కు ఆడిన తర్వాత ట్రాక్టర్, గోల్-ఈ-రాయ్హన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. గాయం కారణంగా గత కొంతకాలం నుంచి అతను ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడటం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అతడి జీవితం అంతమయ్యే పరిస్థితి తలెత్తింది. మరి ఇరాన్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.