1981లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రవిశాస్త్రి.. జట్టుకు బ్యాటర్ గా , బౌలర్ గానే కాకుండా కోచ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత కామెంటేటర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ లో ఇంగ్లీష్ కామెంటేటర్ వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం (మార్చి 28) జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆయన.. ఐపీఎల్ వేలానికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాము క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఐపీఎల్ ఉండుంటేకనీసం 15 కోట్లకు అమ్ముడుపోయే వాడినంటూ వ్యాఖ్యానించాడు. ఒకవేళ తాను ఏ జట్టుకైనా నాయకత్వం వహించాల్సి వచ్చివుంటే అంతకుమించి ధర పలికి ఉండేవాడినంటూ గొప్పలు పోయాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా కెరీర్ మొదలు పెట్టిన రవిశాస్త్రి.. ఆ తర్వాత ఓపెనర్/మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా మారి, నాటి భారత జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఎదిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఇది కూడా చదవండి: చాలా బాధపడ్డాను! RCBని వీడడంపై నోరు విప్పిన యుజ్వేంద్ర చాహల్
టీమిండియా తరఫున 80 టెస్ట్‌లు, 150 వన్డేలు ఆడిన ఆయన.. 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రవిశాస్త్రి తన టెస్ట్ కెరీర్‌లో 11 సెంచరీలు, 12 అర్ధ సెంచరీల సాయంతో 3830 పరుగులు, వన్డేల్లో 4 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీల సాయంతో 3108 పరుగులు సాధించాడు. అలాగే శాస్త్రి.. టెస్ట్‌ల్లో 151 వికెట్లు, వన్డేల్లో 129 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 245 మ్యాచులాడిన రవిశాస్త్రి.. 13202 పరుగులు చేయగా, 509 వికెట్లు తీయడం విశేషం.
How much would Ravi Shastri go for, if he played the IPL? 😋#IPL2022 #IPL #ravishastri pic.twitter.com/sXlwbE2Uhl
— Sportzy Mania – SZM (@SzmMania) March 28, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.