టీమిండియా స్టార్ బ్యాటర్ కెయల్ రాహుల్ గురించి మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆసియా కప్ 2023 కి ఎంపిక చేయొద్దని తెలిపాడు.
ఐపీఎల్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో ఫీల్డింగ్ చేస్తు కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. బంతి కోసం పరుగెడుతున్న సమయంలో ఒక్కసారిగా కాలు పట్టేయడంతో దీంతో అక్కడికక్కడే కూలబడిపోయాడు. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. టోర్నీ మధ్యలోనే ఇంగ్లాండ్ కి వెళ్లి సర్జరీ చేయించుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కి దూరమయ్యాడు. అయితే ఇటీవలే NCA లో ప్రాక్టీస్ చేస్తూ కనబడిన రాహుల్.. ఆసియా కప్ 2023 టోర్నీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే రాహుల్ ని టీమిండియాలోకి తీసుకోవడం అనవసరం అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రీ తెలియజేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ రాహుల్ ఎంత ప్రమాదకర ఆటగాడో మనందరికీ తెలిసిందే. మూడు ఫార్మాట్ లో సెంచరీ చేసిన అతి కొద్దిమంది ప్లేయర్లలో రాహుల్ కూడా ఒకడు. ఫార్మాట్ కి తగ్గట్టుగా టెక్నీక్ మార్చుకుటూ జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. అయితే ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్న రాహుల్ గాయానికి ముందు పెద్దగా ఫామ్ లో లేడు. ఒకదశలో రాహుల్ ని టెస్టు జట్టులో నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. టెస్ట్, టీ 20ల్లో రాహుల్ ఫామ్ పేలవంగా ఉన్నా.. వన్డేల్లో మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా..మాజీ కోచ్ రావిశాస్త్రీ మాత్రం రాహుల్ ని జట్టులోకి తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని భావించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ని ఆసియా కప్ కి ఎంపిక చేయొద్దని సలహా ఇచ్చాడు.
“కెఎల్ రాహుల్ మోకాలి గాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి వస్తున్నాడు. ఈ విషయం సంతోషం కలిగించేదైనా గాయం తీవ్రత గురించి స్పష్టత రాకుండా అతన్ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఆడించడం అస్సలు కరెక్ట్ కాదు. అది కూడా అతని రీఎంట్రీలోనే ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తే, మళ్లీ గాయపడే ప్రమాదం ఉంటుంది. ముందుగా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ప్లేయర్లకు తగినంత సమయం ఇవ్వాలి. వెంటనే టీంలోకి సెలక్ట్ చేయకూడదు. నా ఉద్దేశంలో ఆసియా కప్‌లో కెఎల్ రాహుల్‌ని ఆడించడం వల్ల నష్ట తప్ప ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తున్నాను”. అని రావిశాస్త్రీ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.