ఛాన్సులు మళ్లీ మళ్లీ రావు. వచ్చినప్పుడు పట్టేసుకోవాలని. లేదు తర్వాత తీరిగ్గా బాధపడదామంటే కుదరదు. అవును టీమిండియా- శ్రీలంక మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ లో కొద్దిలో గెలిచిన మన జట్టు, రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. అయితే ఈ రెండింటిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదే లంక కెప్టెన్ దసున్ షనక. అయితే ఇతడి టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా భారత గడ్డపై మంచి ఫెర్ఫార్మెన్స్ ఇస్తూనే వస్తున్నాడు. […]
క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారస్థులకు కోట్లలో లాభాలు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందిస్తూ.. ప్రపంచంలోనే నంబర్ వన్ ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్‌గా దూసుకెళ్తున్న ఐపీఎల్.. 15వ సీజన్ కోసం ముస్తాబవుతోంది. ఇప్పటికే 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న రీచ్ క్యాష్ లీగ్.. మరో గ్రాండ్ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్ల తలరాత మార్చేసిన ఐపీఎల్.. మరిన్ని కోట్లు కురిపించేందుకు, కొత్త కోటీశ్వరులను తయారు చేసేందుకు, ప్రపంచ క్రికెట్‌కు యువ సంచలనాలను […]
ఐపీఎల్- 2023 సందడి అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ప్లేయర్లు, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను కూడా విడుదల చేశాయి. అయితే ఈసారి మినీ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండబోతోందనే చెప్పాలి. ఎందుకంటే.. అందరికంటే ఎక్కువ పర్స్ వ్యాల్యూ ఇప్పుడు హైదరాబాద్ ఫ్రాంచైజీ దగ్గరే ఉంది. రూ.42.25 కోట్లతో అన్ని ఫ్రాంచైజీల కంటే టాప్‌ప్లేస్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఉంది. అంతేకాకుండా ఈసారి హైదరాబాద్ తీసుకున్న నిర్ణయం అందరినీ కాస్త […]
హర్షల్ పటేల్.. ఒక ఆర్సీబీ క్రికెటర్ గా మాత్రమే మనందరకి తెలుసు. ఆర్సీబీ తరఫున.. ఐపీఎల్-2012లో అరంగేట్రంచేసిన హర్షల్ తొలినాళ్లలో నిలకడలేమితో తాను ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఐపీఎల్ వేలం గురుంచి ఆసక్తికర వార్త చెప్పి అందరని అయోమయానికి గురిచేశాడు. ఐపీఎల్ లో.. 2012లో అరంగ్రేటం చేసిన హర్షల్.. ఆర్సీబీ ఆడిన అన్ని మ్యాచుల్లో అవకాశం లభించలేదు. మూడు సీజన్ల పాటు అలానే కాలం నెట్టుకొచ్చాడు. ఎట్టకేలకు 2015 సీజన్‌లో 17 […]
1981లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రవిశాస్త్రి.. జట్టుకు బ్యాటర్ గా , బౌలర్ గానే కాకుండా కోచ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత కామెంటేటర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఐపీఎల్ 2022 సీజన్ లో ఇంగ్లీష్ కామెంటేటర్ వ్యవహరిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం (మార్చి 28) జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన ఆయన.. ఐపీఎల్ వేలానికి సంబంధించి పలు […]
టీమిండియా వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఐపీఎల్ వేలంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ వేలం జరిగే తీరు బాగోలేదని, అది చూసినప్పుడు సంతలో పశువుల వేలాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కోసం పోటీపడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్న దారుణమైన ఫీలింగ్ కలుగుతుందని, వేలం సమయంలో ఆటగాళ్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తాయని వాపోయాడు. వేలంలో‘అమ్ముడుపోని ఆటగాళ్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో […]
ఐపీఎల్ వేలంలో టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఊహించని విధంగా ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంటే విజయ్ శంకర్‌ను మాత్రం చాలా తక్కువ ధరకే గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ.1.40 కోట్లకే విజయ్ శంకర్ జీటీ సొంతమయ్యాడు. గతంలో వరల్డ్ కప్ కోసం టీమిండియాలోకి విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు అతన్ని త్రీ డైమెన్షన్ ప్లేయర్‌గా పేర్కొన్నారు. ఆ […]
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 వేలంలో అనుకోని అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆక్షనీర్ హుగ్ ఎడ్మెడేస్ కళ్లు తిరిగి పడిపోయారు. ఈ క్రమంలో ఎడ్మెడేస్ కు వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని సమాచారం. హుగ్ ఎడ్మెడేస్ కు విశ్రాంతి ఇవ్వడంతో.. ప్రస్తుతం అతడి స్థానంలో చారు శర్మ ఆక్షనీర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెటిజనులు ఆక్షనీర్ హుగ్ ఎడ్మెడేస్ గురించి తెలుసుకునేందకు ఆసక్తి కనబరుస్తున్నారు. […]
బెంగుళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొనడంలేదని పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ప్రకటించారు. తన పిల్లలను వదిలి, ఇండియాకు రాలేకపోతున్నానని ప్రీతి వెల్లడించారు. ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని మిస్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా వేలంలో తమ ప్రణాళిక, ఆటగాళ్ల కొనుగోలు గురించి తన టీమ్‌తో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రీతి వెల్లడించారు. తమ టీమ్ ఫ్యాన్స్ సలహాలను కూడా పరిగణంలో తీసుకుని పరిశీలిస్తున్నట్లు […]
టీమిండియా, ఆర్సీబీ మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ వేలంలో పాల్గొంటే పోటీ మామూలుగా ఉండదు. అతన్ని దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజ్‌లు కోట్లు కుమ్మరిస్తాయి. కానీ విరాట్ ఆర్సీబీని అంటిబెట్టుకుని ఉండడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ కోహ్లీ వేలంలోకి రావాలనుకున్నా ఆర్సీబీ అతడిని రిలీజ్ చేస్తుందా అనేది ప్రశ్న..? కానీ ఇది కుదరదు ఎందుకంటే.. విరాట్, ఆర్సీబీది గట్టిబంధమని స్వయంగా కోహ్లీనే ప్రకటించాడు. ఇతర ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనాలని కోరినప్పుడు కోహ్లీ […]