ఐపీఎల్ వేలంలో టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఊహించని విధంగా ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంటే విజయ్ శంకర్‌ను మాత్రం చాలా తక్కువ ధరకే గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ.1.40 కోట్లకే విజయ్ శంకర్ జీటీ సొంతమయ్యాడు.
గతంలో వరల్డ్ కప్ కోసం టీమిండియాలోకి విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు అతన్ని త్రీ డైమెన్షన్ ప్లేయర్‌గా పేర్కొన్నారు. ఆ సమయంలో జట్టులో చోటు దక్కని అంబటి రాయుడు 3D గ్లాస్సెస్ ట్వీట్ బాగా వైరల్ అయింది. దీంతో విజయ్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్ అనే పేరు వచ్చింది. ఐపీఎల్ వేలంలో తక్కువ ధరకే అమ్ముడుపోవడంతో శంకర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మరి శంకర్‌కు వచ్చిన ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.