తుది మెట్టు మీద బోల్తా పడితే ఎవరికైనా బాధే. ఇక గెలుస్తామన్న మ్యాచ్ లో ఓడిపోతే ఆ కెప్టెన్ బాధ వర్ణనాతీరం. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. సొంత గడ్డపై తమ జట్టుకి మరోసారి టైటిల్ అందించాలనుకున్నా సాధ్యపడలేదు. దీంతో కాస్త ఎమోషనల్ అయ్యాడు పాండ్య.
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్ల మధ్య నిన్న అర్ధ రాత్రి ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం జరగాల్సిన ఈ మ్యాచ్ కి పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫైనల్.. ఫలితం కోసం నిన్న అర్ధ రాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు జరుగుతుందో లేదో అనుకుంటున్నా ఈ మ్యాచ్ ఎట్టలకే జరిగింది. నిన్న సాయంత్రం 7:30 మ్యాచ్ మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ తీసుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. చెన్నై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్ ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ధేశించారు. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచులో చెన్నైని విజయం వరించింది.
ఐపీఎల్ లోనే బలమైన జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్, సొంత గడ్డ.. దీనికి తోడు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ ఈ దశలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఓడిపోతుందని ఎవరైనా ఊహిస్తారా? చెన్నై ఫ్యాన్స్ కూడా దాదాపుగా మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకున్నారు. ఇక చివరి 2 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో గుజరాత్ కి మరో టైటిల్ పక్కా అని ఫిక్స్ అయిపోయారు. కానీ చివరకు చెన్నై విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ కి ఈ ఓటమిని జీర్ణించుకోవడం కాస్త కష్టమే. మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్ధికి పాండ్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.
హార్దిక్ మాట్లాడుతూ ” జట్టుని చూసి గర్వపడుతున్నాను. గెలవడానికి చేయాల్సిందంతా చేసాము. ఓటమికి సాకులు వెతకాలనుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ గెలుపుకోసం ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఫైనల్లో ఒత్తిడిని తట్టుకొని ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సామాన్యమైన విషయం కాదు. ధోని భాయ్ చేతిలో ఓడిపోవడం నేనెప్పటికీ బాధపడను. ఇలా జరగాలని ఈ రోజు రాసి పెట్టి ఉందంతే. మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నేను చూసిన మంచి వ్యక్తుల్లో ధోని ఒకడు. ఆ దేవుడు నా వైపు ఉంటాడనుకున్నా. కానీ ఈ రోజు ధోని వైపే ఉన్నాడు” అని పాండ్య ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్ టైటిల్ చేజారటం కాస్త బాధ కలిగించిన .. ధోని చేతిలో ఓడిపోవడం హార్దిక్ కి కాస్త ఊరట కలిగించే విషయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
Hardik Pandya said, “MS Dhoni deserves it. Destiny has written for him. I’m so happy for him. He’s the nicest I’ve met, god gave him what he deserved today”. pic.twitter.com/WFN4iQiuPx
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2023