ఛాన్సులు మళ్లీ మళ్లీ రావు. వచ్చినప్పుడు పట్టేసుకోవాలని. లేదు తర్వాత తీరిగ్గా బాధపడదామంటే కుదరదు. అవును టీమిండియా- శ్రీలంక మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ లో కొద్దిలో గెలిచిన మన జట్టు, రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. అయితే ఈ రెండింటిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదే లంక కెప్టెన్ దసున్ షనక. అయితే ఇతడి టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా భారత గడ్డపై మంచి ఫెర్ఫార్మెన్స్ ఇస్తూనే వస్తున్నాడు. కానీ ఐపీఎల్ ప్రాంఛైజీలు గుర్తించడం లేదు. తీరా ఇప్పుడు మాత్రం తెగ బాధపడిపోతున్నాయి.
ఇక విషయానికొస్తే.. రీసెంట్ గా భారత్ తో జరిగిన రెండో టీ20లో లంక విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ షనక.. తమ దేశం తరఫున ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు. ఇక టీమిండియాపై ఇది రెండో వేగవంతమైన అర్థశతకం కావడం విశేషం. ఇక తొలి టీ20ల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన షనక.. 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదే కాదు గతేడాది శ్రీలంక జట్టు టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడంలోనూ షనక కీ రోల్ ప్లే చేశాడు. ఇలా తన వరకు ఎప్పటికప్పుడు బెస్ట్ ఇస్తూనే ఉన్నాడు.
ఇక లంక జట్టు కెప్టెన్ గా అద్భుతాలు చేస్తున్న షనక.. కొన్నిరోజులు ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో మాత్రం అమ్ముడుపోలేదు. బేస్ ప్రైజ్ రూ.50 లక్షలతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఒక్క జట్టు కూడా ఇతడి కొనేందుకు ఆసక్తి చూపించలేదు. చెప్పాలంటే కనీసం పట్టించుకోలేదు. ఐపీఎల్ లో తనని కొనలేదనే కసితో ఉన్నాడో ఏమో గానీ టీమిండియాతో టీ20 సిరీస్ లో షనక రెచ్చిపోతున్నాడు. భారత్ జట్టుపై మంచి రికార్డు మెంటైన్ చేస్తున్న ఇతడు.. పరిస్థితులకు తగ్గట్లు ఆడగలిగే అనుభవముంది. వికెట్లు పడుతుంటే నెమ్మదిగా ఆడి చివర్లో భారీ హిట్టింగ్ చేయడంలో మనోడు దిట్ట. అదీగాక కెప్టెన్ గా కూడా ఫుల్ సక్సెస్. దీనికి తోడు మీడియం పేసర్ కూడా. ఇలా ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న ప్లేయర్ ని మిస్ అయ్యాం అని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బాధపడుతున్నాయని తెలుస్తోంది. కేన్ విలియమ్సన్ ని వదులుకున్న సన్ రైజర్స్ జట్టు.. బ్రూక్ బదులు ఇతడిని తీసుకుంటే బాగుండేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Still Wonder why IPL teams didn’t bid for Dasun Shanaka and went unsold in auction. Hard hitting pace allrounder, captaincy 🥶 Deserved to get pick @IPL#INDvSL pic.twitter.com/DLgzrdLQv0
— $@ch!n_r@ju (@chnrju1) January 3, 2023