క్రికెటర్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. వ్యాపారస్థులకు కోట్లలో లాభాలు తెచ్చిపెడుతూ.. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందిస్తూ.. ప్రపంచంలోనే నంబర్ వన్ ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్‌గా దూసుకెళ్తున్న ఐపీఎల్.. 15వ సీజన్ కోసం ముస్తాబవుతోంది. ఇప్పటికే 14 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న రీచ్ క్యాష్ లీగ్.. మరో గ్రాండ్ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్ల తలరాత మార్చేసిన ఐపీఎల్.. మరిన్ని కోట్లు కురిపించేందుకు, కొత్త కోటీశ్వరులను తయారు చేసేందుకు, ప్రపంచ క్రికెట్‌కు యువ సంచలనాలను పరిచయం చేసేందుకు రంగం రెడీ చేసుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో జరగనున్న ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఈ నెల 23న మినీ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ప్రతి మూడేళ్లకు ఒక సారి జరిగే మెగా వేలం కాకుండా.. ప్రతి ఏడాది మినీ వేలం జరుగుతూ ఉంటుంది. ప్రతి సీజన్‌లో ఫ్రాంచైజ్‌లు తమ జట్టులోని ఆటగాళ్లలో తమకు కావాల్సిన వాళ్లని రిటేన్ చేసుకుని కొంతమంది ఆటగాళ్లను రిలీజ్ చేస్తాయి. మరికొంతమందిని ఇంటర్నల్ ట్రేడింగ్ ద్వారా ఆటగాళ్ల మార్పిడి లేదా డబ్బులు ఇచ్చి వేరే టీమ్ ఆటగాడిని తమ టీమ్‌లోకి తీసుకుంటాయి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత.. ఐపీఎల్ కమిటీ మినీ వేలం నిర్వహిస్తుంది. ఈ వేలంలో తమ టీమ్‌లో మిగిలిన స్థానాలకు ఆటగాళ్లను జట్లు కొనుగోలు చేసుకుంటాయి. ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత.. ఇటివల అన్ని ఫ్రాంచైజ్‌లు తమ టీమ్స్‌లోని కొంతమంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. వారంద్దరూ మళ్లీ వేలంలో పాల్గొంటారు.
అలాగే కొత్తగా ఎంతమంది అయినా.. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో పాల్గొనేందుకు కూడా అలాగే చాలా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే.. ఈ సారి ఆ సంఖ్య చాలా పెద్దదిగానే ఉంది. ఏకంగా 991 మంది ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 714 మంది ఇండియన్ ప్లేయర్స్. ఈ 714లో 19 మంది ఇప్పటికే టీమిండియా తరఫున ఆడారు, అలాగే 91 మంది జాతీయ జట్టుకు ఆడకపోయినా ఐపీఎల్‌లో ఆడిన వారు ఉన్నారు. మిగతా వారు దేశవాళీ ఆటగాళ్లు. ఇక 277 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో 166 మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడినవారు కాగా.. 20 మంది అసోసియేట్ దేశాలకు చెందిన వారు. మిగిలిన వారు ఆన్‌క్యాప్డ్ విదేశీ ఆటగాళ్లు.
విదేశీ ఆటగాళ్లలో ఎక్కువగా ఆస్ట్రేలియా నుంచి 57 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తర్వాత సౌతాఫ్రికా నుంచి 52 మంది, వెస్టిండీస్ నుంచి 33 మంది వేలంలో పాల్గొనేందుకు తమ పేర్లు రిజిష్టర్ చేయించుకున్నారు. కాగా.. అత్యధిక బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు ఏకంగా 21 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారందరూ విదేశీ ఆటగాళ్లే. వేలంలో కేన్ విలియమ్సన్, సామ్ కరన్, బెన్ స్టోక్స్ లాంటి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. వీరికి భారీ డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ వేలంలో పాల్గొనరు. ఐపీఎల్ కమిటీ ఈ లిస్ట్‌ను జల్లెడ పట్టి వేలానికి సంఖ్య తగ్గిస్తుంది. మరి వీరిలో ఎంతమంది ఆటగాళ్లు వేలంలో ఉంటారో, ఎవరిపై కోట్ల వర్షం కురుస్తుందో.. ఎవరికి నిరాశే మిగులుతుంతో చూడాలి.
Event – #TATAIPLAuction
Date – 🗓️ 23rd December
Venue – 🏩 Kochi📍#TATAIPL pic.twitter.com/XYMOc9N300— IndianPremierLeague (@IPL) December 2, 2022
NEWS- 991 players register for TATA IPL 2023 Player Auction.
A total of 991 players (714 Indian and 277 overseas players) have signed up to be part of the TATA IPL 2023 Player Auction set to take place on 23rd December 2022 in Kochi.
More details here – https://t.co/JEpOBUKcKe
— IndianPremierLeague (@IPL) December 1, 2022