హర్షల్ పటేల్.. ఒక ఆర్సీబీ క్రికెటర్ గా మాత్రమే మనందరకి తెలుసు. ఆర్సీబీ తరఫున.. ఐపీఎల్-2012లో అరంగేట్రంచేసిన హర్షల్ తొలినాళ్లలో నిలకడలేమితో తాను ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఐపీఎల్ వేలం గురుంచి ఆసక్తికర వార్త చెప్పి అందరని అయోమయానికి గురిచేశాడు. ఐపీఎల్ లో.. 2012లో అరంగ్రేటం చేసిన హర్షల్.. ఆర్సీబీ ఆడిన అన్ని మ్యాచుల్లో అవకాశం లభించలేదు. మూడు సీజన్ల పాటు అలానే కాలం నెట్టుకొచ్చాడు. ఎట్టకేలకు 2015 సీజన్‌లో 17 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత 2018-2020 మధ్య ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం మళ్లీ ఆర్సీబీకి ఆడే అవకాశం దక్కించుకున్న హర్షల్.. 2021 ఎడిషన్‌లో 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ లో ఆర్సీబీ జట్టును ప్లే ఆఫ్స్ చేర్చడంలో తన వంతు పాత్ర పోషించిన హర్షల్.. టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే రిటెన్షన్ సమయంలో ఆర్సీబీ అనూహ్యంగా హర్షల్‌ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలం-2022లోకి రాగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరి.. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ విషయం గురించి హర్షల్ తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో మాట్లాడుతూ.. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: రికార్డులు బద్ధలు కొట్టిన చెన్నై, RCB మ్యాచ్..!
‘‘2018 వేలం జరుగుతున్న సమయంలో.. నా కోసం ఎవరో ఒకరు బోర్డు ఎత్తుతారని ఆశగా ఎదురు చూశాను.. నిజానికి అప్పుడు నేను డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. కేవలం ఆడే అవకాశం దక్కితే చాలనుకున్నా. అంతకుముందే వేర్వేరు ఫ్రాంఛైజీలకు చెందిన ఓ ముగ్గురు నలుగురు ఆటగాళ్లు నన్ను తమ జట్టు కోసం కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఎవరూ ఆ పని చేయలేదు. ఆ క్షణం నేను దారుణంగా మోసపోయాని, ఫ్రాంచైజీలు ద్రోహం చేశాయని భావించా. కొన్ని రోజుల పాటు దాని గురించే ఆలోచించాను. చాలా బాధపడ్డాను. ఈ చీకటి ఆలోచనల నుంచి బయటపడాలనుకున్నా. నా ఆటను మెరుగుపరుచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నా. తర్వాత ఆటపై మాత్రమే దృష్టి సారించి ముందుకు సాగాను’’ అని చెప్పుకొచ్చాడు.
Harshal Patel is pin point accurate with his slow balls and articulate with his thoughts.
Honestly, the only who I believe comes close to him will be Virat Kohli. pic.twitter.com/wlPFtEbyGk
— Vedant (@thatcrickettguy) April 26, 2022
‘I felt cheated’: Harshal Patel reveals how he was betrayed by some IPL franchises Royal Challengers Bangalore pacer Harshal Patel has revealed how he was betrayed by three-four IPL franchises in the early days of his car… #Sports by #TimesofIndia https://t.co/xWagig11mF
— Market’s Cafe (@MarketsCafe) April 26, 2022
ఇక ఐపీఎల్ మెగా వేలం-2022లో ఆర్సీబీ తనను భారీ ధరకు కొనుగోలు చేసిన తర్వాత విరాట్ కోహ్లి సంతోషంగా తనకు మెసేజ్ చేశాడన్న హర్షల్ పటేల్.. తనకు నిజంగానే లాటరీ తగిలిందని అతడితో చెప్పినట్లు పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: KGF చాప్టర్ 2 చూసి ఫిదా అయిపోయిన RCB ఆటగాళ్లు