భారత క్రికెట్లో కెప్టెన్ గా ధోని స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. 2004 డిసెంబర్ లో తొలిసారి టీమిండియా తరపున ఆడిన ధోని.. 2007 లోనే కెప్టెన్ అయ్యాడు. అయితే దీనికి కారణమేంటి అని పరిశీలిస్తే.. నేనే అంటున్నాడు మాజీ భారత కోచ్.
భారత క్రికెట్లో కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. ఐసీసీ టోర్నీ గెలవడం ప్రతి ఒక్క కెప్టెన్ కల. ఒక్క ఐసీసీ టోర్నీ గెలిస్తే చాలు జన్మ ధన్యం అనుకునే కెప్టెన్ లు చాలా మందే ఉన్నారు. కానీ ధోని మాత్రం టీమిండియాకు ఐసీసీ టోర్నీలన్నీ సాధించిపెట్టాడు. వన్డే వరల్డ్ కప్ తో పాటుగా.. టీ 20వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ అందించిన ఘనత ధోని సొంతం. టీమ్‌లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లు ఉన్నా.. మూడేళ్ల అంతర్జాతీయ అనుభవం మాత్రమే ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించడం అప్పట్లో అందరిని షాకింగ్ కి గురి చేసింది. అయితే దీనికి కారణమేంటి అని పరిశీలిస్తే.. నేనే అంటున్నాడు మాజీ భారత కోచ్ రవి శాస్త్రీ.
2004 డిసెంబర్ లో తొలిసారి టీమిండియా తరపున ఆడిన ధోని.. 2007 లోనే కెప్టెన్ అయ్యాడు. ఈ విషయం అప్పట్లో సంచలనం అయినా.. అంచనాలకు మించి రాణించాడు మిస్టర్ కూల్. 2007 వన్డే వరల్డ్ కప్ లో ద్రావిడ్ నాయకత్వంలో భారత్ కనీసం సూపర్ 8 దశను కూడా దాటలేకపోయింది. ముఖ్యంగా పసికూన అయినటువంటి బంగ్లాదేశ్ మీద ఓడిపోవడం సగటు అభిమాని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ద్రావిడ్ కెప్టెన్సీ కి రాజీనామా చేయగా.. అతని స్థానంలో అప్పటి చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అనూహ్యంగా ధోనిని కెప్టెన్ గా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం తనదేనని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి.
“ఈడెన్ గార్డెన్స్‌లో రాహుల్ ద్రావిడ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. ద్రావిడ్ ఆడలేకపోవడంతో కొత్త కెప్టెన్ కోసం చూడాల్సిన పరిస్థితి. ద్రావిడ్ వయసు కూడా దృష్టిలో పెట్టుకుని, టీమిండియాకి ఫ్యూచర్ కెప్టెన్‌ని వెతకాల్సిన సమయం వచ్చేసిందని అనుకున్నాం..అప్పుడు నాకు ధోనీ పేరే గుర్తుకు వచ్చింది. ‘ఈ కుర్రాడిలో లీడర్‌షిప్ క్వాలిటీలు పుషల్కంగా ఉన్నాయి..’ అని వెంగ్‌సర్కార్‌తో చెప్పాను. దిలీప్ కూడా అదే నమ్మాడు. దీంతో ఎక్కువ సమయం దాని గురించి చర్చించలేదు.దిలీప్ ఐడియల్ సెలక్టర్. ధోనీ కూల్‌నెస్ మాత్రమే కాదు, అతను గేమ్‌ని అర్థం చేసుకునే విధానాన్ని కూడా దిలీప్ గమనించాడు. అతని వ్యక్తత్వం, పర్సనాలిటీ, సీనియర్లతో వ్యవహరించే విధానం.. ఇలా అన్నీ చూసి ధోనీని టీమిండియా కెప్టెన్‌గా ఎంచుకున్నాం” అని గవాస్కర్ తెలిపాడు. మరి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయి కామెంట్ల రూపంలో తెలపండి .