భారత దిగ్గజ ఆల్ రౌండర్ వినూ మన్కడ్ కుమారుడు, ముంబై మాజీ క్రికెటర్ రాహుల్ మన్కడ్ బుధవారం కన్నుమూశారు. కుడిచేతి వాటం కలిగిన రాహుల్ మన్కడ్.. బ్యాటర్ గా, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1972 నుండి 1985 వరకు క్రికెట్ ఆడారు. ఆయన కెరీర్ లో.. 47 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు మరియు 12 అర్ధసెంచరీలతో కలిపి 2111 పరుగులు చేశారు. అలాగే బౌలర్ గా 7 వికెట్లు తీశారు.
ఇక 66 ఏళ్ల వయస్సు కలిగిన రాహుల్ మన్కడ్.. గుండెపోటు కారణంగా లండన్ లో చికిత్స పొందుతున్నట్లు పలు నివేదికలు వచ్చాయి. ఈ క్రమంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆయన కోలుకోలేకపోయారని, దురదృష్టవశాత్తు తుదిశ్వాస విడిచారని బుధవారం క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి.రాహుల్ మరణ వార్త విన్న వెంటనే షాక్ అయ్యానని భారత మాజీ పేసర్ టీఏ శేఖర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. “రాహుల్ మన్కడ్ మరణించడం విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఒక ప్రముఖ క్రికెట్ కుటుంబం నుండి వచ్చిన రాహుల్.. మంచి క్రికెటర్, నిజమైన జెంటిల్ మ్యాన్.. అన్నిటికంటే గొప్పవ్యక్తి. రాహుల్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని శేఖర్ తెలిపారు. మరి క్రికెటర్ రాహుల్ మన్కడ్ గురించిన మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Shocked to hear Rahul Mankad passed away Comes from a illustrious cricketing family True gentleman Good cricketer more than that a great human being My heartfelt Condolences to the family May his soul RIP
— TA Sekar (@ta_sekar) March 30, 2022
A flag bearer of one of the greatest surnames in Indian cricket, a very very fine player for Mumbai, and above all else, a wonderful person.. Rahul Mankad has passed away. Om shanti Jigabhai🙏 pic.twitter.com/oKY8U633vW
— Rajdeep Sardesai (@sardesairajdeep) March 30, 2022