ICC Mens FTP Schedule For 2023-27: ఐసీసీ పురుషుల క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ)ని బుధవారం విడుదల చేసింది. 2023 నుంచి 2027 కాలానికి గాను పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు 2023 వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 వరల్డ్‌కప్స్‌తో పాటు రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎడిషన్లు కూడా ఉన్నాయి. 2019-23 కాలంతో పోలిస్తే.. 2023-27 షెడ్యూల్లో మూడు ఫార్మాట్లోనూ మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది.
2023-27 ఎఫ్టీపీ లో 780 మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇక ఆగస్టు 18, 2022 నుంచి ఫిబ్రవరి 2027 కాలంలో భారత్ 44 టెస్టులు, 63 వన్డేలు,76 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(2023-25, 2025-27)లో భాగంగా రెండు ఎడిషన్‌లోనూ ఆస్ట్రేలియా,ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అదే విధంగా 2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్ 27 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.
2023:
2024:
2025:
2026:
ఐసీసీ పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.