SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » How Lata Mangeshkar Helped 1983 World Cup Winning Team

చేతిలో 20 లక్షలు లేక BCCI కష్టాలు! దేవతలా ఆదుకున్న లతా మంగేష్కర్!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Thu - 9 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
చేతిలో 20 లక్షలు లేక BCCI కష్టాలు! దేవతలా ఆదుకున్న లతా మంగేష్కర్!

దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్‌. ఆమె గొంతుమూగబోయి అప్పుడే ఏడాది కాలం అయిపోయింది. 2022 ఫిబ్రవరి 6న కరోనాతో బాధపడుతూ లత తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం భారతీయ సినీ రంగానికే కాక.. యావత్‌ దేశానికే తీరని శోకం మిగిల్చింది. అలాగే ఇండియన్‌ క్రికెట్‌ కూడా లత మృతితో కన్నీళ్లు పెట్టుకుంది. భారత క్రికెట్‌తో లతాది తల్లీబిడ్డల అనుబంధం. ఆమెకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. కొన్ని దశాబ్దాలుగా లత బతికి ఉన్నన్ని రోజులు స్వదేశంలో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు లతా మంగేష్కర్‌ కోసం బీసీసీఐ రెండు వీఐపీ సీట్లను రిజర్వ్‌ చేసి పెట్టేది. ఈ సాంప్రదాయం గతేడాది వరకూ కొనసాగింది. అయితే.. లతా మంగేష్కర్‌ అసలు ఇండియన్‌ క్రికెట్‌కు ఏం చేసింది. బీసీసీఐ ఆమెను అంతలా గౌరవించడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలోని టీమిండియా ఎలాంటి అంచనాలు లేకుండా వన్డే వరల్డ్‌ కప్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ వెళ్లింది. అందరి లెక్కలను తలకిందులు చేస్తూ.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా ఉండి, క్రికెట్‌ ప్రపంచాన్ని ఏలుతున్న వెస్టిండీస్‌ జట్టుతో ఫైనల్లో తలపడి.. అసాధారణ ఆటతీరుతో విజయం సాధించి.. తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ వరల్డ్‌ కప్‌ ఎత్తుకున్నప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. దేశం మొత్తం కపిల్‌ డెవిల్స్‌పై ప్రశంసల వర్షం కురిసింది. కప్పుతో స్వదేశానికి తిరిగొచ్చిన ఛాంపియన్‌ టీమ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో.. బీసీసీఐ సైతం వరల్డ్‌కప్‌ నెగ్గిన ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి నగదు పురస్కారం అందించాలని అనుకుంది.

how-lata-mangeshkar-helped-1983-world-cup-winning-team

జట్టులోని ఆటగాళ్లకు కనీసం ఒక లక్ష రూపాయలు చొప్పున అయినా ఇవ్వాలని భావించింది. కానీ.. చేతిలో చిల్లగవ్వలేదు. వరల్డ్‌ కప్‌ ఆడుతున్న సమయంలో ఆటగాళ్ల రోజువారీ ఖర్చుల కోసం తలా 20 పౌండ్లు సమకూర్చేందుకే బీసీసీఐ నానా కష్టాలు పడింది. అప్పుడు ఆటగాళ్ల నజరానా ఇచ్చే పరిస్థితిలో లేదు. కానీ.. ప్రపంచ వేదికపై భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచి, మన మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన హీరోలకు కనీసం ఇది కూడా చేయకుంటే.. దేశం పరువుపోయేలా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌.. బీసీసీఐని దేవతలా ఆదుకుంది. బీసీసీఐ అధికారి రాజ్‌సింగ్‌ దుంగార్పూర్‌ విజ్ఞప్తి మేరకు ఒక ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం చేసేందుకు లతా మంగేష్కర్‌ ముందుకు వచ్చారు.

అప్పటికే లతా మంగేష్కర్‌ పాటలతో భారతదేశం ఊగిపోతోంది. కచేరి కార్యక్రమంలో లత పాల్గొంటున్నారని తెలిసి.. ప్రజలు పెద్దఎత్తున్న టిక్కెట్లు కొనుక్కొని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో బీసీసీఐకి రూ.20 లక్షల వరకు నగదు సమకూరింది. దీంతో వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌లోని ఆటగాళ్లకు బీసీసీఐ తలా ఒక లక్ష రూపాయల నగదు బహుమతితో సత్కరించింది. అయితే.. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లతా మంగేష్కర్‌ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియాను ఛాంపియన్‌గా నిలిపిన జట్టు కోసం, క్రికెట్‌పై తనకున్న ఇష్టం కోసం, ప్రపంచ దేశాల మందు భారత్‌ పరువు పోకుండా ఉండాలని లత తన గొప్ప మనసును చాటుకున్నారు. అందుకే బీసీసీఐ ఆమె ఉన్నంత కాలం టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్‌కు రెండు వీఐపీ టిక్కెట్లను రిజర్వ్‌ చేసి ఉంచేది. లతా మంగేష్కర్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడి నుంచి ఇండియన్‌ క్రికెట్‌ ఏ స్థాయికి చేరుకుందో మనం చూస్తునే ఉన్నాం. మరి.. భారత క్రికెట్‌ కోసం లతా మంగేష్కర్‌ చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Rest in peace Lata Mangeshkar 💐
The queen of melody had helped the players of Team India earn a phenomenal amount after their 1983 World Cup win.#LataMangeshkar #LataDidi #Cricket #India #KapilDev #CricTracker pic.twitter.com/fQI3u6ssJZ

— CricTracker (@Cricketracker) February 6, 2022

Tags :

  • 1983 World Cup
  • BCCI
  • Cricket News
  • Kapil Dev
  • Lata Mangeshkar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam