‘ఐపీఎల్ 2021’ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఎలాగైనా కోహ్లీ సారథ్యంలో కప్పు కొట్టాలన్న టీమ్, అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. ఆర్సీబీ సీజన్ నుంచి నిష్క్రమించడానికి కింగ్ కోహ్లీ తప్పిదమే కారణమంటూ టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఆరోపించాడు. అలా కాకుండా ఇలా చేస్తే బాగుండేది అంటూ విశ్లేషణ కూడా చేశాడు.
11వ ఓవర్ లాస్ట్ బాల్‌కు హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 12వ ఓవర్‌ను కోహ్లీ ఆల్‌రౌండర్ క్రిస్టియన్‌కు ఇచ్చాడు. ఆ ఓవర్‌లో మూడో బాల్ సిక్స్, నాలుగో బాస్ సిక్స్, తర్వాత వైడ్, ఐదో బాల్ సిక్స్, మళ్లీ వైడ్ ఇలా ఆ ఓవర్‌లో మొత్తం డ్యాన్ క్రిస్టియన్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం మీదే గంభీర్ కూడా వ్యాఖ్యలు చేశాడు. ‘అప్పటికే వికెట్ పడి కేకేఆర్ ప్రెజర్‌లో ఉన్నప్పుడు వికెట్ టేకర్‌కు బౌలింగ్ ఇవ్వాలి. అసలు ఈ సీజన్‌లో డ్యాన్ క్రిస్టియన్ వికెట్ టేకరే కాదు. మరో వికెట్ టేకర్ వచ్చి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసుంటే కేకేఆర్‌కు చాలా కష్టమయ్యేది’ అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆ విధంగా కోహ్లీ చేసిన తప్పే ఆర్సీబీ కొంప ముంచిందని గౌతమ్ గంభీర్ తన అభిప్రాయం, విశ్లేషణను వెల్లిబుచ్చాడు. మరోవైపు కోహ్లీ ఫ్యాన్స్ డ్యాన్ క్రిస్టియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు. వాటిపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తీవ్రంగానే స్పందించాడు. ఓటమిని తట్టుకోలేక అభిమానులు అలా కామెంట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: డ్యాన్ క్రిస్టియన్ భార్యని తిడుతూ ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ! మ్యాక్స్ వెల్ సీరియస్ వార్నింగ్