డ్యాన్ క్రిస్టియన్ భార్యని తిడుతూ ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ! మ్యాక్స్ వెల్ సీరియస్ వార్నింగ్

chiristian

‘ఐపీఎల్‌ 2021’ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కథ ముగిసింది. ఎలాగైనా కోహ్లీ సారథ్యంలో కప్పు కొట్టాలన్న టీమ్‌, అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. ఎంతో కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. మైదానంలోనే కోహ్లీ, డివిలియర్స్‌ కన్నీళ్లు పెట్టుకోవడం ఆర్సీబీ అభిమానులనే కాదు.. యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని కలచి వేసింది. ఈసారి కూడా కప్‌ కొట్టకపోవడంపై కొందరు అభిమానులు బాధతో ఉంటే.. మరికొందరు టీమ్‌పై సోషల్‌ మీడియా వేదికగా దుర్భాషలాడుతున్నారు.

maxwellడాన్‌ క్రిస్టియన్‌ వేసిన ఒక ఓవర్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 22 పరుగులు సాధించారు. ఒక్కసారిగా మ్యాచ్‌ మొత్తం మారిపోయింది. సునీల్‌ నరైన్‌ ఆ ఓవర్లో ఏకంగా 3 సిక్కులు బాదాడు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్‌ తమ కోపాన్ని క్రిస్టియన్‌పై వెళ్లగక్కుతున్నారు. అంతే కాదు అతని భార్యకు సైతం సోషల్‌ మీడియా తిడుతూ సందేశాలు పంపుతున్నారు. దానిపై క్రిస్టియన్‌ స్పందించాడు. ‘నా భార్య ఇన్‌స్టా పోస్టు కామెంట్‌ సెక్షన్‌ను చూడండి. ఈ గేమ్‌ మేము బాగా ఆడలేకపోయాం. అది ఆట మాత్రమే. ఏదేమైనా.. నా భార్యను ఇందులోకి లాగకండి’ అంటూ క్రిస్టియన్‌ ఇన్‌స్టా స్టోరీ పోస్ట్‌ చేశాడు.

ఇదీ చదవండి: మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, డివిలియర్స్ కన్నీరు! పాపం RCB ఫ్యాన్స్!

మ్యాక్సీ సీరియస్‌

మ్యాచ్‌ ఓటమి తర్వాత మ్యాక్స్‌వెల్‌కి కూడా సోషల్‌ మీడియాలో తిడుతూ కామెంట్లు వచ్చాయి. నీ వల్లే మ్యాచ్‌ ఓడిపోయాం అంటూ తిట్ల దండకం అందుకున్నారు. అది చూసిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు కోపం వచ్చింది. వారి కామెంట్లపై స్పందించాడు. ‘ఆర్సీబీ గొప్ప సీజన్‌ ఇంది. మేము అనుకున్న దానికంటే ముందే తప్పుకోవాల్సి వచ్చింది. కొందరు సోషల్‌ మీడియాలో పిచ్చిగా వాగుతున్నారు. మేము మనుషులుగా ప్రతిరోజు మా బెస్ట్‌ ఇస్తున్నాం. ఇలా తిట్టడం మాని మంచి మనుషులుగా ఉండండి. మొదటి నుంచి నిజంగా ఆర్సీబీకి సపోర్ట్‌ చేస్తున్న అభిమానులు అందరికీ ధన్యవాదాలు’ అంటూ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ట్వీట్‌ చేశాడు. ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఆర్సీబీ అభిమానుల పేరుతో ఇలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్‌? మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.