భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మొదలైపోయింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని.. మ్యాచ్ గడిచేకొద్ది బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉంటుందని భావించి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు కమిన్స్ వెల్లడించాడు. అయితే.. ఆసీస్ కెప్టెన్ అంచనాను తలకిందులు చేస్తూ.. భారత పేస్ దళం ఊహించని షాకిచ్చింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే టీమిండియా స్టార్ పేసర్, మన హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్.. సూపర్ డెలవరీతో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అంపైర్ తొలుత నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సిరాజ్‌పై నమ్మకంతో రివ్యూకు తీసుకున్నాడు.
రివ్యూలో బాల్ లైన్‌లో పిచ్ అవుతూ.. లెగ్ స్టంప్‌ను హిట్‌చేస్తున్నట్లు తేలడంతో.. అంపైర్ తన నిర్ణయం మార్చుకుని అవుట్‌గా ప్రకటించాల్సి వచ్చింది. దీంతో.. సిరాజ్ తన తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీసి.. ఎప్పటిలాగే టీమిండియా సూపర్ స్టార్ట్ అందించాడు. సిరాజ్ ఇచ్చిన జోష్‌తో సీనియర్ బౌలర్ మొహమ్మద్ షమీ మరింత రెచ్చిపోయి.. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. షమీ వేసిన స్పీడ్‌కు వార్నర్ ఆఫ్‌స్టంప్ గాల్లో ఎగిరి చాలా దూరంలో పడింది. వికెట్ అలా గాల్లో ఎగురుతున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. ఇలా ఇద్దరు పేసర్లు వరుస ఓవర్లలో ఇద్దరు ఓపెనర్లను పెవిలియన్ చేర్చడంతో.. ఆస్ట్రేలియా 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి లబుషేన్ 47, స్మిత్ 19 పరుగులతో ఆడుతూ.. ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా.. ఆస్ట్రేలియా-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ అంటేనే ఎమెషన్స్‌తో కూడుకుని ఉంటుంది. ఇక క్రికెట్‌తో పాటు స్లెడ్జింగ్ బాగా తెలిసిన ఆసీస్‌తో టెస్ట్ ఆడుతుంటే.. కొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీల్లో కూడా చాలా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ఆసీస్ ఆటగాళ్లకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో విరాట్ కోహ్లీ, సిరాజ్, అశ్విన్ సైతం బదులు చెప్తారనే విషయం కూడా క్రికెట్ అభిమానులకు తెలిసిందే. దీంతో.. ఈ సారి కూడా అలాంటి ఆసక్తికర సంఘటనలు జరుగుతాయని క్రికెట్ ఫ్యాన్స్ ముందే ఓ నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి అలాంటివి ఉంటేనే టెస్టు క్రికెట్‌కు అందం. ఎమెషన్స్ లేని క్రికెట్ మ్యాచ్ ప్రాణంలేని దేహంలా ఉంటుంది. అయితే.. నాలుగు టెస్టుల ఈ ట్రోఫీలో రోజులు గడిచే కొద్ది అలాంటి సంఘటనలు చూస్తామని ఆశించిన అభిమానులకు తొలి రోజు నుంచే.. ఆ వేడిని చూపిస్తున్నారు ఆటగాళ్లు. సిరాజ్, జడేజా బౌలింగ్‌లో స్మిత్ ఆడుతూ.. తన విచిత్రమైన హావభావాలను ప్రదర్శిస్తున్నాడు. అలాగే అశ్విన్, లబుషేన్‌కు సైలెంట్‌గా కళ్లతోనే వార్నింగ్‌లు ఇస్తున్నాడు. ఈ చిన్నచిన్న సంఘటలు చూసిన క్రికెట్ అభిమానులు.. తొలి రోజు నుంచే టెస్టు క్రికెట్ మజా మొదలైపోయిదంటూ పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chess game between Marnus and Ashwin. pic.twitter.com/zarCq9emZv
— Johns. (@CricCrazyJohns) February 9, 2023
A thumbs up by Steven Smith to Ravindra Jadeja for bowling a good delivery. pic.twitter.com/0zGbrxH352
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2023