దాదాపు 17 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రావాల్పిండిలో జరిగిన తొలి టెస్టును 74 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్.. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్టులో 26 పరుగులతో ఉత్కంఠ విజయం సాధించింది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఇంగ్లంగ్‌ను ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు నిలువరించగలిగినా.. బ్యాటర్లు తేలిపోయారు. దుర్భేద్యమైన ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్ ముందు నిలువలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కేవలం 281 రన్స్‌కే ఆలౌట్ అయింది. బెన్ డకెట్, ఓల్లీ పోప్ మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు.
అయితే.. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన బౌలర్ల కష్టానికి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు పాక్ బ్యాటర్లు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 202 పరుగులకే కుప్పకూలింది పాక్. దీంతో ఇంగ్లండ్‌కు 79 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ లీడ్‌ను రెండో ఇన్నింగ్స్‌తో మరింత పెంచుకున్న ఇంగ్లండ్ 275 పరుగులకు ఆలౌట్ అయి.. పాక్‌కు 354 పరుగుల టార్గెట్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లోనూ రిస్క్ తీసుకుని గెలిచిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చింది. 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులతో పటిష్ట స్థితిలో కనిపించిన పాకిస్థాన్‌ను నాలుగో రోజు 328 పరుగులకు ఆలౌట్ చేసి 26 పరుగులు స్వల్ప తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవలం చేసుకుంది. ఇక మిగిలిన చివరి టెస్టు.. ఈ నెల 17న కరాచీలో జరగనుంది.
కాగా.. ఈ మ్యాచ్‌తో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అబ్రార్ అహ్మెద్ మంచి ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లోనూ 4 వికెట్లు తీసుకున్నాడు. ఒక రనౌట్ కూడా చేశాడు. ఇలా అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 11 వికెట్లు తీసుకుని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లలో అబ్రార్, జాహిద్ రాణించినా.. పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. అలాగే బ్యాటింగ్ వైఫల్యంతో పాక్ సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఈ ఓటమితో టెస్టు ఛాంపియన్ షిప్ 2022 నుంచి కూడా పాక్ నిష్క్రమించింది. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడే అవకాశం లేదు.
Hard-fought Test match 🏏
Congratulations to @englandcricket on winning the series.#PAKvENG | #UKSePK pic.twitter.com/7Ays6MOagD
— Pakistan Cricket (@TheRealPCB) December 12, 2022