అగ్రెసివ్ అప్రోచ్‌తో టెస్టు క్రికెట్‌కు కొత్త కళ తీసుకొస్తున్న ఇంగ్లండ్.. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పాక్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడేందుకు దాదాపు 17 ఏళ్ల తర్వాత ధైర్యం చేసి.. పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్.. తొలి టెస్టులో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. హైవేలాంటి ఫ్లాట్ పిచ్‌ను ఏర్పాటు చేస్తున్నా.. తమ అగ్రెసివ్ గేమ్‌తో తొలి టెస్టులో విజయం సాధించింది. కానీ.. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో మాత్రం ఇంగ్లండ్ అగ్రెసివ్ […]