ఐపీఎల్ 2021 రెండో దశ పోటీలు ఆదివారం ముంబై చెన్నై మధ్య మ్యాచ్‌తో ప్రారంభం అయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముంబైపై చెన్నై విజయం సాధించింది. ఒకదశలో చెన్నై స్కోరు 24/4 కీలక బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరారు. డు ప్లెసిస్ (0), రైనా (4) మొయిన్ అలీ (0), కెప్టెన్ ధోని (3) వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నీతానై (58 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్‌తోపాటు రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్), డ్వేన్ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడారు.
తర్వాత చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేశారు. చెన్నై 20 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. ముంబై బౌలర్లలో ఆడమ్ మిల్నే, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్ చహర్ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంకాగా. పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.
బ్రావోపై గుస్సా అయిన కెప్టెన్ కూల్..
మొత్తం ముంబై ఇన్నింగ్స్‌లో నిలకడగా అడిన సౌరభ్ తివారీ అర్థ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలో ఆరు వికెట్లు కోల్పోయి ముంబై పీకల్లోతు కష్టాల్లో సమయంలో దీపక్ చాహర్ వేస్తున్న18 నాలుగో బంతిని 41 వ్యక్తిగత పరుగుల వద్ద తివారీ బంతిని గాల్లోకి ఆడాడు. దాన్ని అందుకోడానికి ధోని, బ్రావో పరిగెత్తుకోచ్చారు. ఇద్దరు ఒకే సారి రావాడంతో సులువైన క్యాచ్ నెలపాలైంది. దీంతో ధోని బ్రావోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా చెన్నై మ్యాచ్ గెలించింది కనుక బ్రావో ఊపిరిపీల్చుకున్నాడు.