గత కొన్ని రోజులుగా టీమిండియా-పాక్ క్రికెటర్ల మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ వార్ ముగిసింది అనుకునే లోపే మరో మాటల యుద్ధానికి తెరలేపాడు పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా. టీమిండియా వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగబోయే ఆసియా కప్ లో పాల్గొనకపోతే.. భారతదేశంలో 2023లో జరిగే వరల్డ్ కప్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈ విషయాలు బీసీసీఐ-పీసీబీ రెండు బోర్డులు కలిసి సంయుక్తంగా నిర్ణయాలు తీసుకంటాయని తాజాగా కౌంటర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ కు 2023 వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేసేంత దమ్ము లేదని స్వయంగా ఆదేశ మాజీ క్రికెటరే అన్నాడు. దాంతో పాక్ పరువు కాస్తా ప్రపంచ దేశాల ముందు పోయింది.
పాకిస్థాన్ క్రికెటర్లు భారత్ ను తిడదానికి, టీమిండియా ప్లేయర్స్ ను విమర్శిద్దానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటుంది. మరీ ముఖ్యంగా షోయబ్ అక్తర్, రమీజ్ రాజాలు లు మాటలతో టీమిండియాపై దాడి చేస్తుంటారు. ఆ మాటలకు దీటైన కౌంటర్లు ఇస్తుంటారు భారత ఆటగాళ్లు. అయితే టీ20 వరల్డ్ కప్ లో పాక్ ఓటమి చెందినప్పటి నుంచి పాక్ పై సొంత దేశానికి చెందిన మాజీ ఆటగాళ్లే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వరల్డ్ కప్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేస్తుంది అన్న వ్యాఖ్యలపై మండిపడ్డాడు.
“ప్రపంచ క్రికెట్ బోర్డుల్లో అత్యంత ధనవంతమై బోర్డుగా బీసీసీఐ ఉంది. దాంతో సహజంగానే ఐసీసీ బోర్డు భారత్ కు అనుకులంగా ఉంటుంది. అదీకాక ఐసీసీ నిర్వహిస్తున్న 2023 వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేసే దమ్ము గానీ ఉద్దేశం కానీ పాక్ లేదు. ఇక క్రికెట్ లో భారత్ ను ఎదిరించే దమ్ము కూడా పాక్ కు లేదు” అని డానిష్ కనేరియా ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ కు సంబంధించిన నిర్ణయాలు ఏ ఒక్కరు తీసుకునేవి కాదని, దానికి క్రికెట్ బోర్డు ఉంటుందని కనేరియా అన్నాడు. బోర్డ్ చీఫ్ గా ఉన్నంత మాత్రానా అతడి నిర్ణయమే ఫైనల్ కాదని మండిపడ్డాడు. ICC లాంటి మెగా టోర్నీలను బాయ్ కాట్ చేసి.. క్రికెట్ ప్రపంచంలో ఎలా ఆడగలరని రమీజ్ రాజాను ప్రశ్నించాడు. బాయ్ కాట్ చేస్తామని మాట్లాడే ముందు భవిష్యత్ ను కూడా ఆలోచించాలని సూచించాడు కనేరియా.
India, on the other hand, don’t care if Pakistan don’t come (India for WC 2023) – Danish Kaneria added 👀#WorldCup2023 #AsiaCup2023 #INDvPAK pic.twitter.com/FJZlEXO1Xf
— CricTracker (@Cricketracker) November 28, 2022