ధనాధన్ క్రికెట్ హంగామా ఐపీఎల్ 2022 సీజన్ శనివారం చెన్నై, కోల్‌కత్తా మధ్య జరిగిన మ్యాచ్‌తో మొదలైంది. కానీ.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో లీగ్ ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు భంగపాటు ఎదురైంది. తొలి మ్యాచ్‌లో CSK.. కేకేఆర్ చేతిలో6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై నిర్జీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగుల స్వల్ప స్కోర్ సాధించింది. ఇందుల్లో ఆ జట్టు మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోని చేసిన పరుగులే 50 ఉన్నాయి. తొలుత వరుసగా వికెట్లు కోల్పోయిన CSK.. ధోని రాకతో కొంత కోలుకుంది.
కాగా.. చెన్నై ఓటమికి ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా చేసిన ఒక భారీ తప్పిదం కూడా కారణమని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 49 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆ జట్టు సీనియర్ ప్లేయర్ అంబటి రాయుడు మంచి టచ్‌లో కనిపించాడు. ఒక ఫోర్, అద్భుతమైన సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను వేగంగా ముందుకు నడిపించేలా కనిపించాడు. కానీ.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ నరైన వేస్తున్నాడు. నాలుగో బంతిని CSK కెప్టెన్ జడేజా బ్యాక్ ఫుట్‌లోకి వచ్చి ఫుష్ చేశాడు. దీంతో రాయుడు పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ జడేజా స్పందించలేదు.. దీంతో మిడ్ వికెట్ వద్ద ఫిల్డింగ్ చేస్తున్న కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతని వేగంగా నరైన్‌కు అందించాడు. దీంతో రాయడు రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో ఫోర్, సిక్స్ సాయంతో 15 పరుగుల చేసి రాయుడు నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలా CSK 53 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
జడేజా వల్లే రాయుడు రనౌట్ అయ్యాడని, రాయుడు క్రీజ్‌లో ఉంటే CSK పరిస్థితి మెరుగ్గా ఉండేదని ఫ్యాన్స్ జడేజాపై మండిపడుతున్నారు. సహజంగా మైదానంలో దూకుడుగా ఉండే జడేజా కెప్టెన్ బాధ్యతలతో ఈ మ్యాచ్‌లో కొంత ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. అందుకే పరుగు కోసం ఆచితూచి వ్యవహరించి రాయుడిని బలిచేసినట్లు అభిమానులు పేర్కొన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కెప్టెన్‌గా జడేజా తత్తరపాటు! ధోకికే కోపం తెప్పించాడు
WICKET! And that’s another one gone for CSK as a mix-up leads to Ambati Rayudu being run out! CSK 52/4
Rayudu run out (Shreyas/Narine) 15(17)#IPL2022 #CSKvKKR
Live Scorecard: https://t.co/WzHLh4MSat
Live Updates: https://t.co/YyY0UM33KI
— CricketNDTV (@CricketNDTV) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.