టీమిండియా ప్లేయర్లు ఐపీఎల్ కే అధిక ప్రాధాన్యమిస్తారని, గర్వం ఎక్కువగా ఉంటుందని కపిల్ దేవ్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై జడేజా స్పందిస్తూ ఈ లెజెండరీ ఆల్ రౌండర్ కి కౌంటర్ విసిరాడు
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నేడు చివరిదైన మూడో వన్డే జరగనుంది. తొలి వన్డే టీమిండియా గెలవగా.. రెండో వన్డే విండీస్ నెగ్గింది. దీంతో ట్రినిడాడ్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ సిరీస్ ని నిర్ణయించేది కావడంతో ఆసక్తికరంగా మారింది. మరో రెండు నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి రెండు మెగా టోర్నీలు ఉండడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ మీద ఇంకా స్పష్టత రాలేదు. స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా గత కొంతకాలంగా భారత క్రికెట్ కి దూరమయ్యారు. ఐతే వీరి గాయాల మీద ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆసియా కప్ కి సెలక్ట్ అయ్యేది అనుమానంగానే మారింది. దీంతో ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ని పటిష్టం చేసేందుకు సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్ లకు వరుస అవకాశాలు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి కోహ్లీ, రోహిత్ బెంచ్ కే పరిమితం కానున్నారు. స్టార్ ఆటగాళ్ల గాయాల కారణంగా ఇటీవలే టీమిండియా ప్లేయర్లకు గర్వం అని చేసిన వ్యాఖ్యలకు తాజాగా రవీంద్ర జడేజా స్పందించాడు.
“భారత ఆటగాళ్లు చిన్న గాయాలున్నా ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఇలాంటి చిన్న గాయాలు ఉన్నప్పుడు దేశం తరపున ఆడినందుకు నిరాకరిస్తున్నారు. అందరికీ ఐపీఎల్ ముఖ్యమైనా.. అది ఇండియన్ క్రికెట్ ని నాశనం చేస్తుంది”.అని ఇటీవలే కపిల్ దేవ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లెజెండరీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే తాజాగా జడేజా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కపిల్ కి కౌంటర్ వేసినట్లుగానే కనిపిస్తుంది. ఈ సందర్భంగా జట్టులో ఎవరికీ గర్వం లేదని అందరూ 100 శాతం కష్టపడతారని స్పష్టం చేసాడు. అంతే కాదు జట్టులో ఇలాంటి మార్పులు చేయడం వలన పెద్దగా నష్టం ఉండదని తెలిపాడు.
” ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ కి మేము ఆడబోయే చివరి వన్డే సిరీస్ ఇది. మెగా టోర్నీల్లో ప్రయోగాలు చేయడానికి పెద్దగా ఆస్కారం ఉండదు. అందుకే ఇప్పుడు భారీ మార్పులు చేయక తప్పడం లేదు. రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగాం. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసేందుకు ప్రయత్నించాం. ఈ మ్యాచ్ లో మేము ఓడిపోయినా మాకు పెద్దగా జరిగిన నష్టం ఏమీ లేదు. మెగా టోర్నీల్లో ఎలాంటి కాంబినేషన్ తో వెళ్లాలనే దానిపై ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ అందరూ వంద శాతం కష్టపడతారు. ఓడిపోయినప్పుడే వారి ప్రదర్శనపై ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ ఎవరూ కూడా పొగరుగా ఉండరు”. అని జడేజా చెప్పుకొచ్చాడు. మరి జడేజా ఇలా పరోక్షంగా కపిల్ దేవ్ కి కౌంటర్ విసరడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.