బార్బడోస్ వేదికగా నేడు వెస్టిండీస్ తో టీమిండియా రెండో వన్డేకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో రెండో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో భాగంగా టీమిండియా నేడు రెండో వన్డే కోసం సిద్ధమవుతుంది. తొలి వన్డేలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రోహిత్ సేన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ దక్కించుకోవాలని చూస్తుంది. మరోవైపు సొంతగడ్డపై విండీస్ జట్టు తొలి వన్డేలో దారుణమైన పరాజయాన్ని మర్చిపోయి నేడు జరగనునున్న రెండో వన్డేలో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. బార్బడోస్ వేదికగా జరిగే ఈ వన్డే రాత్రి 7 గంటలకు దూరదర్శన్ ఛానల్ లో చూడవచ్చు. ఇక ఓటీటీలో జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఇదిలా ఉండగా.. టీమిండియా తుది జట్టులో నేడు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కి అవకాశం దక్కొచ్చని తెలుస్తుంది. ఒకసారి ప్లేయింగ్ ఎలెవన్ పరిశీలిస్తే..
తొలి వన్డేలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, జడేజా టీమిండియాకు ఒంటి చేత్తో విజయాన్ని అందించారు. అయితే బ్యాటింగ్, పేస్ విభాగాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేదు. స్వల్ప లక్ష్యాన్ని కూడా 5 వికెట్ల కోల్పోయి ఛేదించడం కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. ఇక పేస్ బౌలర్లు కూడా మెరుగుపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో ఒక రెండు మార్పులు చోటు చేసుకోనున్నాయి. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కేవలం 19 పరుగులు చేసి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో సూర్య స్థానంలో సంజు శాంసన్ కి అవకాశం ఇవ్వాలని టీం యాజమాన్యం భావిస్తున్నట్లుగా సమాచారం. ఎంతో టాలెంట్ ఉన్నా శాంసన్ కి గత కొంతకాలంగా వరుస అవకాశాలు ఇవ్వడం లేదు. గాయంతో కోలుకొని మళ్ళి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుర్రాడు.. ఛాన్స్ వస్తే తనని తాను నిరూపించుకునేందుకు రెడీగా ఉన్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగి తొలి వన్డేలో ప్రభావం చూపించలేకపోయాడు. విండీస్ బౌలర్లు ఉమ్రాన్ ని చాలా తేలికగా ఆడేశారు. బౌలింగ్ వేసిన వారందరూ వికెట్ దక్కింక్కుకున్నా ఉమ్రాన్ మాత్రం నిరాశ పరిచాడు. దీంతో ఈ జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ నేటి మ్యాచ్ లో బెంచ్ కి పరిమతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అతని స్థానంలో ఉనాద్కట్ కి ప్లేయింగ్ 11 లో చోటు దక్కుతుంది. ఈ రెండు మార్పులు మినహాయించి జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. మరి తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలు చేసిన టీమిండియా నేటి మ్యాచులో అలాగే కంటిన్యూ చేస్తుందా లేదా చూడాలి. మరి సంజు శాంసన్ కి రెండో వన్డేలో అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.