భారత జట్టు నుంచి తొలగించిన తర్వాత బోర్డ్ ప్రెసిడెంట్ గంగూలీ, కోచ్ ద్రవిడ్‌లను లక్ష్యంగా చేసుకుని వెటరన్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ భరోసా ఇస్తే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ ఆలోచన చేయాలని సూచించాడని పేర్కొన్నాడు. సాహా ఈ ఆరోపణలతో చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో ఉన్న ఒక జాతీయ స్థాయి ఆటగాడు ఇలా వ్యాఖ్యలు చేయడం నిబంధనలు (6.3 క్లాజ్) ఉల్లంఘించినట్లు పేర్కొంటారు. ఆటగాళ్లు.. జట్టు ఎంపిక, ఆట గురించి, ఆటలో జరిగే సంభాషణలను బహిరంగపరచడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం. జాతీయ స్థాయి ఆటగాడు ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు. ఈ నేపథ్యంలోనే సాహా నుంచి బీసీసీఐ వివరణ కోరనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. “సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఒక క్రికెటర్ గా.. టీం ఎంపిక విషయాలపై ఎలా మాట్లాడాడో వివరణ ఇవ్వాల్సిందిగా సాహాను అడిగే అవకాశం ఉంది, అయితే సాహాకు షోకాజ్ నోటీస్‌లు పంపడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదన్నారు”.అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు సాహాను ఎంపిక చేయలేదు. అతనిని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను తెలియజేయాల్సిన అవసరం లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మీడియాతో అన్నాడు. ఈ వ్యాఖ్యలతో కొంత అసంతృప్తికిలోనైనా సాహా.. ఓ ఇంటర్వ్యూలో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు భవిష్యత్తులో ఆడబోయే సిరీస్ లలో తనను ఎంపిక చేయకపోవచ్చని, రిటైర్మెంట్ తీసుకోవాలని ద్రవిడ్ పరోక్షంగా సూచించాడని సాహా చెప్పుకొచ్చాడు.
Wriddhiman Saha talking about Sourav Ganguly’s words after scoring 61 runs Innings with pain killers. (To TOI) pic.twitter.com/rH4qJzVQMH
— CricketMAN2 (@ImTanujSingh) February 19, 2022
న్యూజిలాండ్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్ అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ప్రశంసిస్తూ జట్టులో చోటుపై భరోసా ఇచ్చాడని.. కానీ ఇంతలోనే పరిస్థితులన్నీ మారిపోయాయని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం తనను ఇబ్బంది పెట్టాడని, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని సాహా ట్వీట్ చేశాడు. సదరు జర్నలిస్ట్ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను కూడా అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై విచారణకు బీసీసీఐ ముగ్గురు సభ్యుల కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. దాంతో వివాదాలకు దూరంగా ఉండే సాహా గత వారం రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.
#WriddhimanSaha refuses to name the journalist who sent him threatening text messages after the wicketkeeper-batter ignored him for an interview. pic.twitter.com/LkO7l9gvL0
— Circle of Cricket (@circleofcricket) February 22, 2022