ఆసియా కప్ 2022లో టీమిండియా ప్రస్థానం దాదాపు ముగిసినట్టే. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో అందుకు తగ్గట్లు రెచ్చిపోయింది. కానీ.. కీలకమైన సూపర్ ఫోర్‌కు వచ్చేసరికి మాత్రం దారుణంగా విఫలం అవుతోంది. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్.. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ దారుణంగా పరాజయం పాలైంది. ఆసియా కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక అద్భుత ఆటతీరుతో భారత్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ ఓటమితో టీమిండియా ఆసియా కప్ ఫైనల్ చేరడం దాదాపు అసాధ్యం. దురదృష్టవశాత్తు టీమిండియా కెప్టెన్ రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ టాస్ ఓడిపోయాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శ్రీలంక ఓపెనర్లు ఇద్దరూ.. హాఫ్ సెంచరీలతో లంక ఇన్నింగ్స్‌కు గట్టిపునాది వేశారు. తర్వాత భారత్ స్పిన్నర్లు లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా.. వారి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన ఐదు కారణాలు చెప్పుకోవచ్చు.. అవి..
1. రోహిత్ బ్యాడ్ కెప్టెన్సీ
శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. తొలుత బ్యాటింగ్‌లో మూడో వికెట్ పడిన తర్వాత రిషభ్ పంత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను పంపి తప్పు చేశాడు. పంత్ క్రీజ్‌లోకి ముందు వచ్చి ఉంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వర్క్‌అవుట్ అయ్యేది. కానీ.. పాండ్యా క్రీజ్‌లోకి వచ్చి సింగిల్స్‌తోనే కాలక్షేపం చేశాడు. అవుట్ అయ్యేముందు ఒక సిక్స్ మాత్రమే కొట్టాడు. ఇక బౌలింగ్ విషయంలోనే రోహిత్ రాంగ్‌స్టెప్ వేశాడు. పిచ్ పేసర్లకు అనుకూలించడం లేదని తెలిసినా.. పవర్ ప్లేలో పేసర్ల చేతనే బౌలింగ్ చేయించాడు. దీంతో శ్రీలంక బ్యాటర్లు భారీగా పరుగులు పిండుకున్నారు. కొత్త బంతితో పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసే అశ్విన్‌ను కాదని, పాండ్యా, చాహల్‌తో ఎటాక్ చేయించాడు. దీంతో శ్రీలంకకు ఎలాంటి స్టార్ రాకూడదో అలాంటి స్టార్ ఇచ్చినట్లు అయింది. పవర్‌ప్లేలో ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు.
2. సరిగాలేని తుది జట్టు కూర్పు
పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత కూడా టీమిండియా సరైన జట్టుతో బరిలోకి దిగలేదనే చెప్పాలి. టీమ్‌లో దీపక్ హుడాను ఎందుకు ఆడిస్తున్నారో అర్థం కావడంలేదు. ఆల్‌రౌండర్ కమ్ టాపార్డర్ బ్యాటర్‌గా ఉన్న హుడాను తీసుకొన్ని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతున్నారు. పైగా అతనితో బౌలింగ్ చేయించడం లేదు. మరీ అలాంటప్పుడు అతన్ని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. అతనిస్థానంలో దినేష్ కార్తీక్‌ను తీసుకున్నా.. డెత్ ఓవర్స్‌లో ఉపయోగం ఉంటుంది. ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్థాన్‌తో మిగతా బౌలర్లు అంతా విఫలం అయినా.. రవి బిష్ణోయ్ రాణించాడు. అలాంటిది అతన్ని కాదని చాహల్‌కు మరో అవకాశం ఇచ్చారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఉండగా.. అశ్విన్‌ను తీసుకున్నారు.
3. ఫేలవ బౌలింగ్
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ ఎటాక్ పసికూన జట్ల కంటే దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాణించిన పాండ్యా.. తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. అతనిపై నమ్మకంతో నాలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో మాత్రమే బరిలోకి దిగుతున్న భారత్‌కు.. అతను ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. భువీ, అర్షదీప్ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నారు. జట్టులో బుమ్రా, షమీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. చాహల్ శ్రీలంకతో మూడు వికెట్లు తీసినా పరుగుల కూడా భారీగానే ఇచ్చాడు.
4. దినేష్ కార్తీక్‌ను తీసుకోకపోవడం
టీమిండియా సూపర్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చివరి ఓవర్స్‌లో సరిగా పరుగులు చేయలేకపోయింది. అందుకు కారణం నిఖార్సైన ఫినిషర్ లేకపోవడమే. దినేష్ కార్తీక్ రూపంలో ఒక థండర్‌బోల్ట్ లాంటి ఫినిషర్ ఉన్నా.. టీమిండియా ఉపయోగించుకోలేకపోతుంది. పాకిస్థాన్‌తో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోని టీమిండియా.. శ్రీలంకతోనూ అతన్ని పక్కనపెట్టి భారీ మూల్యం చెల్లించుకుంది. బౌలింగ్ ఇవ్వకుంటే.. దీపక్ హుడా స్థానంలో దినేష్ కార్తీక్ బెస్ట్ ఛాయిస్. అయినా కూడా టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం డీకేను పక్కనపెడుతోంది.
5. టాస్ ఓడిపోవడం
ఇక అన్నింటి కంటే అతి ముఖ్యమైంది టాస్. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోలానే ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. టాస్ కీలకంగా మారుతున్న దుబాయ్ పిచ్‌లపై టాస్ గెలిచిన టీమ్ సగం మ్యాచ్ గెలిచినట్టే. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు అనుకూలం ఉంటున్న పిచ్.. రెండో ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోంది. దానికి తోడు డ్యూ కూడా కీలకంగా మారుతోంది. ఇలాంటి పిచ్‌పై టాస్ ఓడిపోవడం నిజంగా టీమిండియా దురదృష్టమనే చెప్పాలి. అదృష్టంతో గెలిచినా, దురదృష్టంతో ఓడినా.. గెలుపు గెలుపే.. ఓటమి ఓటమే. మరి శ్రీలంక చేతిలో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆసియా కప్ విన్నర్ ఎవరో చెప్పేసిన సెహ్వాగ్! ఇండియా అయితే కాదు..
Another close match in Dubai and it is Sri Lanka who win by 6 wickets.
Scorecard – https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/zxOAo5yktG
— BCCI (@BCCI) September 6, 2022