నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సమరం సాగనుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1తో ఓడిస్తే తప్ప.. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరలేదు. అలాగే 2004 నుంచి భారత్‌లో ఒక్క టెస్టు కూడా గెలవని ఆస్ట్రేలియా ఈ సారి ఆ చెత్త రికార్డుకు ముగింపు పలకాలని భావిస్తోంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఎంతో ఆసక్తికరంగా సాగనుంది. టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా సైతం ఈ సిరీస్‌ను ఎంతో సీరియస్‌గా తీసుకుంది. అందుకే సిరీస్ ఆరంభానికి 10 రోజుల ముందే భారత్‌తో మకాం వేసిన ఆసీస్ నెట్స్‌లో చెమటలు చిందిస్తోంది.
ప్రస్తుతం టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న ఆస్ట్రేలియాను భయపెడుతన్న అంశం ఒక్కటే.. అది స్పిన్. బ్యాటింగ్, పేస్ బౌలింగ్ విషయంలో ఆస్ట్రేలియా పటిష్టంగానే ఉంది. అలాగే నాథన్ లియన్‌తో వారి స్పిన్ విభాగం కూడా పర్వాలేదు. కానీ.. ఇండియాలో మ్యాచ్‌లు జరుగుతుండటంతో ఆసీస్ బ్యాటర్లు భయపడుతున్నారు. ప్రపంచ మేటి స్పిన్నర్లు ఉన్న భారత్‌తో టెస్టుల్లో రాణించాలంటే.. ఆసీస్ కచ్చితంగా స్పిన్‌ను మెరుగ్గా ఆడాలి. కానీ.. టెస్టు క్రికెట్‌లో అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. వారిని ఎదుర్కొని ఆసీస్ బ్యాటర్లు నిలబడటం అంటే గొప్ప విషయమే. అందుకే టీమిండియాతో సిరీస్ అనగానే కంగారులు స్పిన్ బౌలింగ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
బాల్ గింగిరాలు తిరిగే పాత పిచ్‌లపైనే ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అచ్చం అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ఉన్న ఓ యువ క్రికెటర్‌ను తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. సేమ్ టూ సేమ్ అశ్విన్ వేసినట్టే బౌలింగ్ వేస్తున్న ఆ యువ క్రికెటర్ మహేష్ పితియా మనోడే. భారత్‌లో ఆడే నాలుగు టెస్టుల కోసం పితియాను ఆస్ట్రేలియా టీమ్ తమ నెట్ బౌలర్‌గా తీసుకుంది. అతని బౌలింగ్‌లో ఆసీస్ ప్రధాన బ్యాటర్లంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే.. ఆసీస్ టెస్ట్ స్పెషలిస్ట్ స్టీవ్ స్మిత్‌ను ఈ యువ బౌలర్ వణికిస్తున్నాడు. నెట్స్‌లో ఇప్పటికే మూడు సార్లు స్మిత్ అవుట్ చేశాడు పితియా. అసలైన మ్యాచ్‌లో అశ్విన్ భయంతో ఈ డుప్లికేట్ అశ్విన్‌తో ప్రాక్టీస్ చేస్తున్న స్మిత్.. నెట్స్‌లో అతని బౌలింగ్‌నే ఎదుర్కొలేకపోతున్నాడు. ఇక రియల్ మ్యాచ్‌లో అశ్విన్‌ను ఎలా ఎదుర్కొంటాడు అంటూ క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Australia have brought in a specialist off-spinner, Mahesh Pithiya who grew up being called ‘Ashwin’ of his team. Aussies are planning big 👀#BGT2023 #INDvAUS pic.twitter.com/miqRoQNHNv
— CricTracker (@Cricketracker) February 4, 2023
How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they’ve only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j
— cricket.com.au (@cricketcomau) February 3, 2023