మన కుర్రాడినే వాడుకుని మనల్నే దెబ్బకొడదామని అతి తెలివి ప్రదర్శించిన ఆస్ట్రేలియాకు అశ్విన్ సరైన బుద్ది చెప్పాడు. బౌలింగ్ యాక్షన్‌తో కాదు.. స్కిల్‌తో ముడిపడి ఉంటుందని చాటి చెప్పాడు. కంగారుల జిత్తులమారి ఎత్తులకు అందనంత ఎత్తులో ఉంటానని ఆసీస్‌కు అర్థం అయ్యేలా చెప్పాడు.
ఈ మధ్య కాలంలో ఎక్కువుగా వినిపించిన పేరు.. ‘అశ్విన్ డూప్లికేట్‘. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా, రవిచంద్రన్ అశ్విన్ ను ఎదుర్కోవడం కోసం అలాంటి బౌలింగ్ శైలి ఉన్న యువకుడితో బౌలింగ్ చేపించుకున్నట్లు పలు కథనాలు వెలుబడిన సంగతి తెలిసిందే. ఆ అశ్విన్ డూప్లికేట్ పేరు.. ‘మహేష్ పితియా’. బరోడా క్రికెటర్ అయిన పితియా బౌలింగ్ శైలి అచ్చం టీమిండియా ఆటగాడు అశ్విన్ లానే ఉంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా అతనిని నెట్ ప్రాక్టీస్ కోసం నియమించుకుంది. […]
నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టుతో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం సమరం సాగనుంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1తో ఓడిస్తే తప్ప.. భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరలేదు. అలాగే 2004 నుంచి భారత్‌లో ఒక్క టెస్టు కూడా గెలవని ఆస్ట్రేలియా […]