మన కుర్రాడినే వాడుకుని మనల్నే దెబ్బకొడదామని అతి తెలివి ప్రదర్శించిన ఆస్ట్రేలియాకు అశ్విన్ సరైన బుద్ది చెప్పాడు. బౌలింగ్ యాక్షన్‌తో కాదు.. స్కిల్‌తో ముడిపడి ఉంటుందని చాటి చెప్పాడు. కంగారుల జిత్తులమారి ఎత్తులకు అందనంత ఎత్తులో ఉంటానని ఆసీస్‌కు అర్థం అయ్యేలా చెప్పాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బోణి కొట్టింది. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. మూడో రోజే మ్యాచ్‌ను ముగిస్తూ.. ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 లీడ్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలవలేకపోయిన చోట.. రోహిత్ శర్మ సెంచరీకి తోడు జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. అంతకు ముందే ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా బౌలర్లు, రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా 91 పరుగులకే కుప్పకూల్చారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 5, అశ్విన్ వికెట్లతో చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5, జడేజా 2 వికెట్లు సాధించారు. ఇలా వీరిద్దరూ కలిసి ఆసీస్ పనిపట్టారు. అశ్విన్-జడేజా జోడీ 15 వికెట్లు పడగొట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందే అశ్విన్‌కు భయపడిన ఆస్ట్రేలియా.. అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఓ ప్లాన్ వేసింది.
భారత్‌కు చెందిన మహేష్ పితియా అనే యువ ఆఫ్ స్పిన్నర్‌ను తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. సిరీస్ ఆరంభానికి పది రోజులు ముందుగానే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. టర్న్ ఉండే పాత్ పిచ్‌లపై అశ్విన్ లాంటి యాక్షన్‌తో బౌలింగ్ వేసే పితియా బౌలింగ్‌లో తెగ ప్రాక్టీస్ చేసింది. రోజుల తరబడి ప్రాక్టీస్ చేసిన తర్వాత.. సరిగ్గా మ్యాచ్‌కు ముందు అశ్విన్ అంటే తమకు ఎలాంటి భయం లేదని, అతన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ.. బరిలోకి దిగిన తర్వాత అసలు సినిమా కనిపించింది. డుప్లికేట్‌కు రియల్‌కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందన్న విషయం ఆసీస్‌కి బోధపడింది. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా చెలరేగతుంటే సపోర్టివ్ రోల్ పోషించిన అశ్విన్.. 3 వికెట్లతో సరిపెట్టుకున్నాడు.
కానీ.. రెండు ఇన్నింగ్స్‌లో మాత్రం జడేజాకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్ల మతిపోగొడుతూ.. అందరిని పెవిలియన్‌కు వరుస కట్టించాడు. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, రెన్షా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ క్యారీ లను బోల్తా కొట్టించాడు. అశ్విన్ బాల్‌ను గింగిరాలు తిప్పుతుంటే.. అంతకుముందు నెట్స్‌లో పితియా బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయినట్లు ఉన్నారు. ఒకటో తరగతి సబ్జెక్టు ప్రిపేర్ అయిన విద్యార్థికి సివిల్స్ ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు బెంబేలెత్తిపోయారు. అశ్విన్‌ను ఆడేందుకు తమ దగ్గర సమాధానం లేదన్నట్లు వికెట్లు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌తో ప్రపంచంలో తనలాంటి స్పిన్నర్ తానొక్కడినే ఉన్నానని.. డుప్లికేట్లు పనిచేయరని అశ్విన్ ఆసీస్‌కు అర్థమయ్యేలా చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లు వేసిన అశ్విన్ 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి 37 రన్స్ ఇచ్చి 5 వికెట్ల హాల్ సాధించాడు. మరి ఈ మ్యాచ్‌కు ముందు పితియా బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసి.. అశ్విన్ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ashwin is a master in Test cricket. pic.twitter.com/PyE7CEFZOM
— Johns. (@CricCrazyJohns) February 11, 2023
C Kohli B Ashwin combo is back. pic.twitter.com/yixy3i9sQe
— Johns. (@CricCrazyJohns) February 11, 2023
Australia have brought in a specialist off-spinner, Mahesh Pithiya who grew up being called ‘Ashwin’ of his team. Aussies are planning big 👀#BGT2023 #INDvAUS pic.twitter.com/miqRoQNHNv
— CricTracker (@Cricketracker) February 4, 2023