ఈ మధ్య కాలంలో ఎక్కువుగా వినిపించిన పేరు.. ‘అశ్విన్ డూప్లికేట్‘. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా, రవిచంద్రన్ అశ్విన్ ను ఎదుర్కోవడం కోసం అలాంటి బౌలింగ్ శైలి ఉన్న యువకుడితో బౌలింగ్ చేపించుకున్నట్లు పలు కథనాలు వెలుబడిన సంగతి తెలిసిందే. ఆ అశ్విన్ డూప్లికేట్ పేరు.. ‘మహేష్ పితియా’. బరోడా క్రికెటర్ అయిన పితియా బౌలింగ్ శైలి అచ్చం టీమిండియా ఆటగాడు అశ్విన్ లానే ఉంటుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా అతనిని నెట్ ప్రాక్టీస్ కోసం నియమించుకుంది. ఇప్పుడు అసలు విషయమేమింటే.. జూనియర్ అశ్విన్ (మహేష్ పితియా), సీనియర్ అశ్విన్.. రవిచంద్రన్ కలిశాడు. కలవడమంలో ఏముంది అనుకోకండి.. అక్కడ జరిగిన సన్నివేశాలు మరో హైలైట్.
బోర్డర్ – గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలవడమే ఇరు జట్ల ప్రధాన లక్ష్యం. స్వదేశీ పిచులు భారత్ కు అనుకూలమైనా.. బలమైన ఆసీస్ జట్టును అంతతక్కువ అంచనా వేయలేం. ఈ క్రమంలో భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం కోసం ఆస్ట్రేలియా వేసిన డూప్లికేట్ వ్యూహమే.. మహేష్ మితియా. సోషల్ మీడియా వీడియోల అతన్ని వెతికి మరీ పట్టుకుంది. అతని బౌలింగ్ యాక్షన్ చూసిన ఆసీస్ జట్టు సహాయక సిబ్బంది వెంటనే అతడిని నెట్ ప్రాక్టీస్ కోసం నియమించుకున్నారు. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ పితియా బౌలింగ్‌లో షాట్లు ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Australian net bowler Mahesh Pithiya has a Similar action like Ravichandran Ashwin! He is a young cricketer who recently made his Ranji trophy debut for Baroda. Australian players are practicing against him to counter ashwin in test match! #INDvsAUS #INDvAUS #CricketTwitter pic.twitter.com/wHP7YsEK96
— Cricket With Laresh (@Lareshhere) February 3, 2023
అలా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన పితియా తాజాగా, భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్, మాజీ సారధి విరాట్ కోహ్లిలను కలిశాడు. ఈ క్రమంలో అశ్విన్ పాదాలను తాకి మరీ ఆశీర్వాదం తీసుకున్నాడు. “ఇవాళ నేను నా ఆరాధ్యదైవాన్ని కలిశాను. అతనే.. రవిచంద్రన్ అశ్విన్. అతని పాదాలను తాకి ఆశీర్వాదాలు తీసుకున్నా. అతను నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుని.. ఆస్ట్రేలియన్ ప్లేయర్‌లకు నేను ఎలా బౌలింగ్ చేస్తున్నానో వివరాలు అడిగారు. అదే సమయంలో లెజెండరీ క్రికెటర్ విరాట్ కోహ్లీ నా వైపు చూసి నవ్వారు. మంచిగా రాణించాలని చెప్పారు…” అంటూ మహేశ్ పితియా ఎమోషనల్ అయ్యారు. ఈ 21 ఏళ్ల స్పిన్నర్ గతేడాది డిసెంబర్‌లో బరోడా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేశాడు.