వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 119 పరుగుల పార్ట్నర్షిప్తో గట్టి పునాది వేశాడు. కానీ.. ఇన్నింగ్స్ ఒక రేంజ్లో సాగుతున్న క్రమంలో శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 పరుగులు) చాలా బద్దకంగా పరిగెత్తి తన వికెట్‌ను చేజేతులా సమర్పించుకున్నాడు.
జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ 4వ బంతి మిడ్ వికెట్ దిశగా ఆడిన గిల్.. సింగిల్ కోసం చాలా నెమ్మదిగా వెళ్లాడు. ఇది గమనించిన విండీస్ కెప్టెన్ బాల్‌ను మెరుపు వేగంతో అందుకుని డైరెక్ట్ హిట్‌తో గిల్‌ను అవుట్ చేశాడు. నిజానికి అది ఈజీ సింగిల్ కానీ.. పూరన్ అంత వేగంగా బంతిని అందుకుని తన ఎండ్‌కు తిరిగి త్రో వేస్తాడని గిల్ ఊహించలేదు. కానీ పూరన్ గిల్ అంచనాను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే రనౌట్ చేశాడు. ఇక గిల్ లేజీ రనౌట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మంచి ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ‘ఇన్నింగ్స్ మంచి దశలో ఉన్నప్పుడు శుభ్‌మన్ గిల్ అలా చేయాల్సింది కాదు. ఈ విషయంపై కెప్టెన్‌గా ధావన్ గిల్‌ను కొంత గట్టిగా హెచ్చరిస్తాడని అనుకుంటున్నా.. ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా గిల్‌కు అర్థమయ్యేటట్లు ధావన్ చెప్పాలి’ అని అగార్కర్ పేర్కొన్నాడు. అయితే.. తన రనౌట్‌పై శుభ్‌మన్ గిల్ కూడా స్పందించాడు. ‘మ్యాచ్ గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. నా రనౌట్ డిజప్పాయింట్ చేసింది.’ అని అన్నాడు. మరి గిల్ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shubman Gill is run out by Nicholas Pooran.#WIvIND #INDvsWI pic.twitter.com/g0Es1n4or1
— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) July 22, 2022