సోషల్ మీడియా వేదికగా ధావన్ ఎప్పుడూ అందరిని పలకరిస్తూనే ఉంటాడు. తాజాగా విజయ్ లియో సినిమాలో స్టెప్పులేస్తూ కనిపించాడు.
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంత ప్రమాదకరమైన బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలోకి అడుగుపెడితే తనదైన స్టయిల్లో అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. సెంచరీ చేయగానే రెండు చేతులు సూటిగా ఆడియన్స్ వైపుగా చూపించడం, క్యాచ్ పట్టిన అనంతరం తొడ కొడుతూ సంబరాలు చేసుకోవడం లాంటివి చేస్తూ కెమెరాని తనవైపు తిప్పుకుంటాడు. గ్రౌండ్ లో చేసే హడావుడి సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో గబ్బర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎప్పుడూ స్పోర్టీవ్ గా ఉండే ధావన్.. టీమిండియాలో స్థానం కోల్పోయినా డ్యాన్స్ వేస్తూ అభిమానులకి మంచి కిక్ ఇచ్చాడు. ప్రస్తుతం ధావన్ చేసిన ఈ డ్యాన్స్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది.
సోషల్ మీడియా వేదికగా ధావన్ ఎప్పుడూ అందరిని పలకరిస్తూనే ఉంటాడు. ఇందులో భాగంగా ఆ మధ్య ఓ బాలీవుడ్ మూవీలోని కనబడి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసాడు. కొన్ని యాడ్స్ లో నటించిన ధావన్ వీలు చిక్కినప్పుడల్లా రీల్స్ చేస్తూ చిల్ అవుతూ ఉంటాడు. ఈ వెటరన్ ప్లేయర్ చేసే డ్యాన్స్ కి మంచి క్రేజ్ ఉంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి అప్ కమింగ్ మూవీ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన “నా రెడీ” అనే పాటకు ధావన్ డ్యాన్స్ వేస్తూ అభిమానులని ఖుషి చేసాడు. ధావన్ జోష్ కి ఫిదా అయిపోయిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. టీమ్‌లో ఉన్నా లేకపోయినా ధావన్‌లో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక డ్యాన్స్ సంగతి పక్కన పెడితే ధావన్ క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉందని తెలుస్తుంది. గతేడాది బంగ్లాదేశ్ మీద చివరి వన్డే ఆడిన ధావన్.. ఆ సిరీస్ లో పూర్తిగా విఫలమయ్యాడు. అంతకు ముందు న్యూజీలాండ్ టూర్ లో కూడా ధావన్ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈ సీనియర్ ఓపెనర్ ని జట్టు నుండి తప్పించారు. ఇదిలా ఉండగా స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ కి చోటు దక్కుతుందని భావించినా ఆ అవకాశం అయితే కనిపించడం లేదు. యువ ఓపెనర్లు గిల్, కిషన్, జైస్వాల్ ఫామ్ లో ఉండడం ధావన్ కి ప్రతికూలంగా మారింది. దీంతో ఒకవేళ ఆసియా కప్ కి ధావన్ ని సెలక్ట్ చేయకపోతే ఇక ధావన్ కెరీర్ ముగిసినట్టే అని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. మొత్తానికి ధవన్ వేసిన స్టెప్పులు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.
THIS IS JUST W❤️🔥W 👑
THE @SDhawan25 dances to #NaaReady from #Leo 🔥 ➡️ https://t.co/KBhQjLFX0F#Thalapathy @actorvijay @Dir_Lokesh @7screenstudio @anirudhofficial @Jagadishbliss @immasterdinesh pic.twitter.com/R2qfw3Iqvd
— Sony Music South (@SonyMusicSouth) July 23, 2023