క్రికెట్ అభిమానులకు వినోదం.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటారు. రీచ్ క్యాష్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను చూసి చాలా దేశాల్లో అలాంటి లీగ్‌లు పుట్టుకొచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లాంటి టోర్నీలు చాలానే వచ్చాయి.
తాజాగా ఇలాంటి లీగ్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ప్రారంభించనుంది. కాగా.. ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో విజయవంతమైన టీమ్ మేనేజ్‌మెంట్లు సౌతాఫ్రికాలో ప్రారంభం కానున్న టీ20లో కూడా తమ జట్లను దించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆరు ఫ్రాంచైజ్‌లు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంచైజ్ దక్కించుకునేందుకు వేలంలో పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ యజమానులు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా టీమ్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్‌లో విజయవంతమైన ఈ ఫ్రాంచైజ్‌లకే అక్కడి నగరాలను ఎంపిక చేసుకునే అవకాశం సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కల్పిస్తున్నట్లు సమాచారం.
దీంతో.. కేప్‌టౌన్ టీమ్‌ను ముంబై ఇండియన్స్‌కు, జోహన్సెబర్గ్ చెన్నెసూపర్ కింగ్స్‌కు, సెంచురీయన్ ప్రిటోరియా ఢిల్లీ క్యాపిటల్స్‌కు, డర్బన్ లక్నో సూపర్ జెయింట్స్‌కు, ఎల్జిబెత్ సిటీ సన్‌రైజర్స్‌కు, పార్ల్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్‌కు దక్కే అవకాశాలు ఉంది. ఈ ఫ్రాంచైజ్‌ల కోసం చెన్నై సూపర్‌కింగ్స్ మేనేజ్‌మెంట్ అత్యధికంగా 250 కోట్లు బిడ్ వేసినట్లు సమాచారం.
దాదాపు అదే పేర్లు, జెర్సీతో కొత్త జట్లు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో బరిలోకి దిగనున్నాయి. కాకపోతే.. ఇక్కడ మన నగరాల పేర్లకు బదులు ఇక్కడి నగరాల పేర్లు వచ్చి చేరుతాయి.. జోహన్సెబర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, పార్ల్ రాయల్స్ ఇలా అన మాట. ఇప్పటికే ఐపీఎల్‌లో ఉన్న కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఒక జట్టు ఉంది. ట్రిబాగో నైట్‌రైడర్స్ పేరుతో దాదాపు అదే జెర్సీలో కేకేఆర్ మేనేజ్‌మెంట్ అక్కడ కూడా ఫ్రాంచైజ్ నడిపిస్తుంది. ఇప్పుడు నైట్‌రైడర్స్ బాటలోనే మరికొన్ని జట్లు నడవనున్నాయి.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు భారీ సంఖ్యలో ఐపీఎల్ ఫ్రాంచైజ్‌లు పోటీ ఎందుకు పడుతున్నాయంటే.. దానికి కూడా ఒక కారణం ఉంది. ఐపీఎల్ 2009 సీజన్ నిర్వహణ భారత్‌లో సాధ్యపడకపోవడంతో.. ఆ సీజన్‌ను బీసీసీఐ సౌతాఫ్రికాలో నిర్వహించారు. అక్కడ కూడా ఐపీఎల్‌కు ఊహించని విధంగా స్పందన వచ్చింది.
భారత్‌లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్‌కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో.. సౌతాఫ్రికాలో నిర్వహించిన రెండో సీజన్‌కు కూడా అంతే స్పందన వచ్చింది. ఆ సీజన్‌లో డెక్కన్ చార్జర్స్ విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సౌతాఫ్రికా టీ20 లీగ్ సక్సెస్ అవుతుందని భావించి ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It could effectively be a mini-IPL in South Africa after IPL franchises swept the team auction of Cricket South Africa’s upcoming Twenty20 league. 🔥@vijaymirror has details: https://t.co/ObwGCvLntv
— Cricbuzz (@cricbuzz) July 19, 2022