టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. స్టార్ బ్యాట్ మన్ కేఎల్ రాహుల్.. తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, తన ప్రేయసి ఉత్కర్షను ఈ నెల 3న వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు
టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. స్టార్ బ్యాట్ మన్ కేఎల్ రాహుల్.. తన ప్రేయసి, సునీల్ శెట్టి గారాల పట్టి అతియా శెట్టిని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. ఆ తర్వాత భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, తన ప్రేయసి ఉత్కర్షను మహబలేశ్వర్ సమీపంలోని ‘మహబలేశ్వర్ రిసార్ట్’లో ఈ నెల 3న వివాహం చేసుకున్న సంగతి విదితమే. మరో టీమిండియా బౌలర్.. ప్రశీద్ కృష్ణ తన స్నేహితురాలు రచన మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇప్పడు మరో స్టార్ క్రికెటర్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతడు మరెవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ పాండే.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుల్లో ఒకరు తుషార్ పాండే. ఈ ఐపీఎల్‌లో బాగా రాణించాడు. చెన్నై తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పుడు అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబయిలో తుషార్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలి నభా గడ్డం వార్ చేతికి ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థానికి టీమ్ ఇండియా క్రికెటర్స్ శివమ్ దూబే తదితరులు హాజరయ్యారు. తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను తుషార్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘నా స్కూల్ క్రష్ నుండి నాకు కాబోయే భార్యగా ఆమె ప్రమోట్ అయ్యింది’అంటూ ట్వీట్ చేశారు. క్రికెటర్లలంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వెల్ కమ్ టూ క్లబ్ అంటూ రుతురాజ్ కామెంట్ చేశారు. సూర్య కుమార్ యాదవ్, ప్రశాంత్ సోలంకి, తదితరులు విషెస్ తెలిపారు.