CM YS Jagan: గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ భేటీ అయింది. ఆ భేటీ ఎందుకు? ఆ భేటీలో ఏం జరగబోతోంది? అన్న విషయాలు భేటీకి హాజరైన 24మంది మంత్రులకు, మీడియాకు, సామాన్య జనాలందరికీ తెలుసు. బయటకు వచ్చిన తర్వాత మంత్రుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? వారి స్పందన ఏంటి? ఇలా చాలా సంగతుల్ని తెలుసుకోవటానికి మీడియా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం ఈ 24 మందికి మంత్రి పదవులు ఇస్తున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ వారికి ఓ మాట చెప్పారు. ఈ మంత్రులను కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే క్యాబినేట్‌లో కొనసాగిస్తానని, రెండున్నర సంవత్సరాల తర్వాత 24 మంది స్థానంలో వేరే వారిని క్యాబినేట్‌లోకి తీసుకుంటానని అన్నారు.
రాజీనామాలు చేయాల్సిన సమయం ఆసన్నం అయింది. భేటీ ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చి బయటకు వచ్చేశారు. చాలా మంది తమ తమ వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారు. కొంతమంది మాత్రమే మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తున్నందుకు తమకు ఎలాంటి బాధ లేదని, తమ అధినాయకుడు వైఎస్ జగన్ మాటే తమకు శిరోధార్యం అని వాళ్లు చెప్పారు. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. సాధారణంగా కొన్నేళ్లపాటు మంత్రి పదవిలో కొనసాగి, దాన్నుంచి బయటకు రావాలంటే కొందరికి కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని, అసహనం రూపంలో వ్యక్తం చేస్తుంటారు. ఏదో ఒక చోట వెల్లగక్కుతూ ఉంటారు.కానీ, తాజాగా రాజీనామాలు చేసిన 24 మంది మంత్రుల్లో ఎవ్వరూ అలా చేయలేదు. లోగుట్టుగానైనా అసహనం వ్యక్తం చేస్తున్నారన్న వార్తలు ఎక్కడా రాలేదు. సీఎం జగన్ తీసుకున్న రెండున్నర సంవత్సరాల క్యాబినేట్ చారిత్రాత్మక నిర్ణయం అయితే, రాజీనామాలు చేసిన మంత్రులు ఎలాంటి అసంతృప్తికి గురికాకుండా చూసుకోవటం ఆయన అద్భుత నాయకత్వానికి అద్దం పడుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేసే దమ్ము, అవసరం ఏ నాయకుడి లేదు అని చెప్పొటంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు.
పార్టీని సక్రమంగా ఎలాంటి కుట్రలు, కుంతంత్రాలకు తావివ్వకుండా నడపటంలో వైఎస్ జగన్, ఎన్టీఆర్‌ను మించి పోయారన్నది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయాలు ఎంతో కొంత బాగున్న ఆ రోజుల్లో అసలు రాజకీయాలతో సంబంధం లేని ఎంతో మందికి ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తును ఇచ్చారు. వారికి పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారు. అయితే, వారిలో చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఆ కుట్రలు తట్టుకోలేక మంత్రి వర్గాన్ని సైతం రద్దు చేశారాయన. కానీ, వైఎస్ జగన్ విషయంలో ఇలాంటివేవీ జరగలేదు. మంత్రి పదవి పోతుందని ముందే తెలిసినా ఎవ్వరూ తమ అసహనాన్ని వెల్లగక్కలేదు. అసహనంగా ఉన్నారన్న వార్తలు కూడా రాలేదు.పైపెచ్చు నిన్న కొడాలి నాని మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే.. మంత్రి పదవులు పోతున్నందుకు వారికంటే సీఎం జగన్ ఎక్కువగా బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి కష్టంగా ఉన్నా సీఎం జగన్ మంత్రులతో రాజీనామాలు చేయిస్తే.. సీఎం జగన్ మాటకు ఏ మాత్రం అడ్డుచెప్పకుండా కొడాలి నాని, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి రాజకీయ ఉద్దండులు సైతం రాజీనామాలు చేశారు. మరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ పట్ల ఉన్నది భయమా.. భక్తా.. అన్న విషయానికి వస్తే.. సీఎం జగన్ పట్ల పార్టీ ఎమ్మెల్యేలకు ఉన్నది భయంతో కూడిన భక్తి కావచ్చు!! అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఏపీ మంత్రి వర్గం రాజీనామా.. కొడాలికి మరో అవకాశం లేనట్లేనా?..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.