తన ఫోన్ ట్యాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం జగన్‌కి ద్రోహం చేస్తే.. దేవుడు తనను నాశనం చేస్తాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘నన్ను అనుమానించారు.. నా ఫోన్ ట్యాప్ చేశారు అనే ఆలోచనతోనే నేను పార్టీకి దూరం అయ్యాను. నేను జగన్‌కు ద్రోహం చేస్తే దేవుడు నన్ను నాశనం చేస్తాడు. నేను తప్పు చేయకపోతే నాకు మద్దతిస్తాడు. నన్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎనీ టైం నన్ను అరెస్ట్ చేయండి. జగన్‌కు ద్రోహం చేస్తే.. నన్ను సర్వనాశనం చేయమని రుద్రాక్ష చేత పట్టుకుని ప్రమాణం చేస్తున్నాను. అనిల్ కుమార్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. ఏదైనా ఉంటే నాతో చూసుకోవాలి.. నా పిల్లల ప్రస్తావన ఎందుకు’’ అని కోటంరెడ్డి ప్రశ్నించారు.
‘‘మీరు నా గొంతు నొక్కాలని చూస్తున్నారు.. ఎన్‌కౌంటర్ చేస్తే తప్ప నా గొంతు మూగబోదు. నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. ఈరోజా.. రేపా.. ఎల్లుండా.. కమాన్ రండి. దమ్ముంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయండి. నాపై ఎన్ని కేసులైనా పెట్టండి. నా గొతును ఎవరు ఆపలేరు. ఇసుకారులు, మద్యం వ్యాపారులు ఆడియోలు నేను బయటపెడితే.. సజ్జల పోస్ట్ నెక్ట్స్ రోజే ఊడిపోతుంది. నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీని మీద విచారణ జరిపించండి.. నిగ్గుతేల్చండి అని కోరాను. దీనిపై మా ప్రభుత్వం స్పందించి.. కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తే.. మీ పారదర్శకత ప్రజలకు తెలిసేది. నాకు అవమానం జరిగింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చాను’’ అన్నారు. కోటంరెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.